కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు
17-02-202017-02-2020 09:19:34 IST
2020-02-17T03:49:34.616Z17-02-2020 2020-02-17T03:47:35.090Z - - 11-04-2021

ఢిల్లీలో మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ పాలన సజావుగా సాగేందుకు కేంద్రంతో కలిసి పనిచేయాలనుకుంటున్నా, ఇందుకు ప్రధాని మోదీ ఆశీస్సులు కావాలంటూ సందేశం పంపారు కేజ్రీవాల్. ఎన్నికలు ముగిసినందున రాజకీయాలతోనూ ఇక పనిలేదని, ఎన్నికల సమయంలో తనపై అనేక విమర్శలు గుప్పించిన వారిని క్షమించేశానని, ఇక అభివృద్ధి. సంక్షేమంపై దృష్టిపెడతానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ 62 గెలవగా, బీజేపీ 8 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ ప్రాతినిధ్యం కోల్పోయింది. ఆదివారం ఉదయం చారిత్రక రాంలీలా మైదానంలో 'ధన్యవాద్ ఢిల్లీ' పేరుతో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో మూడోసారి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు.. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, కైలాస్ గహ్లోత్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్, ఇమ్రాన్ హుస్సేన్‌లతో లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజల్ ప్రమాణం చేయించారు. హ్యాట్రిక్ విజయంతో ఉత్సాహంగా ఉన్న కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రారంభించి దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించడం విశేషం. కేంద్రంతో పలు సందర్భాల్లో తలపడిన కేజ్రీవాల్ ఈసారి మాత్రం.. తన పాలన సజావుగా సాగాలంటే ప్రధానమంత్రి సాయం కోరడం చర్చకు దారితీసింది. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేజ్రీవాల్ కు ప్రధాని అభినందనలు తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నేరవేర్చడంలో ఆప్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు మోడీ. దీనికి ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు కేజ్రీవాల్. మన దేశ రాజధానిని నిజమైన ప్రపంచస్థాయి నగరంగా చేసేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తానన్నారు. ప్రమాణ స్వీకారానికి ప్రధానికి కూడా ఆహ్వానం పంపామనీ, ఆయన బిజీగా ఉండి రాలేకపోయి ఉంటారని అన్నారు. ఎవరిపైనా సవతి తల్లి ప్రేమ చూపనని, వచ్చే ఐదేళ్లూ ఢిల్లీ ప్రజలందరి కోసం పనిచేస్తానన్నారు. ‘హమ్ హోంగే కామ్యాబ్..’ అంటూ కార్యక్రమానికి హాజరైన ప్రజలతో గొంతుకలిపారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ప్రస్తుతం ఈ పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హిందీ చిత్రం 'పైగాం'లోని 'ఇన్సాన్ కా హో ఇన్సాన్ సే భైచారా' అనే దేశభక్తి గీతం ఆలపించారు. ఇటు ఢిల్లీలో విజయంతో ఆప్ ఉత్సాహంగా ఉంది. దేశవ్యాప్తంగా ఆప్ సభ్యత్వాలు స్వీకరించాలని భావిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోని కనీసం కోటి మందికి చేరువ అవ్వాలన్న లక్ష్యంతో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు ఒక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
12 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా