కూలి దొరక్క పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆకలి కష్టాలు
26-06-201926-06-2019 08:32:38 IST
Updated On 26-06-2019 08:32:34 ISTUpdated On 26-06-20192019-06-26T03:02:38.666Z26-06-2019 2019-06-26T03:02:04.411Z - 2019-06-26T03:02:34.365Z - 26-06-2019

అతను ఓ ఆదివాసీ తెగకు చెందిన రోజూవారి కూలీ. వృత్తి చిన్నదైనా ఆయన సంకల్పం గొప్పది. తన గ్రామానికి ఆయన చేసిన సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశంలో నాలుగో అత్యున్నత పౌరపురస్కారం అయిన పద్మశ్రీ అందించి ఆయన గౌరవించింది.
కానీ, ఇప్పుడు అదే పద్మశ్రీ అవార్డు ఆయనకు బుక్కెడు అన్నం దూరం చేస్తోంది. ప్రభుత్వ సత్కారంతో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆయనకు రోజు కూలీ మాత్రం దొరకడం లేదు. దీంతో తన అవార్డును తిరిగి అప్పగించేందుకు సిద్ధమయ్యారు.

ఒడిశాలోని కియన్ఝార్ జిల్లా తలబైతరని గ్రామానికి చెందిన దైతారి నాయక్‌కు రెక్కడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఆయన రోజూ కూలీకి వెళితే కానీ ఆ రోజు కుటుంబసభ్యుల కడుపు నిండని పరిస్థితి.
ఇంత పేదరికంలో ఉన్నా పదిమంది బాగు కోసం ఆలోచించే స్వభావం దైతారి నాయక్ది. గ్రామలో ప్రజలకు నీరు లేక పంటలు పండించుకోలేకపోతున్నారనే ఆవేదనతో ఆయన ఓ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు.
ఏకంగా కొండలు తొలచి కాలువ తవ్వి తన గ్రామంలోని 100 ఎకరాలకు నీరందేలా చేశారు. తన కుటుంబసభ్యులతో కలిసి మూడేళ్ల పాటు ఆయన శ్రమించి కాలువను పూర్తి చేశారు. దీంతో ఆ పొలాల్లో నీరొచ్చింది. తన కష్టతో రైతుల మొఖాల్లో వెలుగులు నింపిన దైతారి ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు.
దైతారి శ్రమను, స్ఫూర్తిని గుర్తించిన కేంద్రం ఆయనకు ఇటీవల పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. దీంతో ఆయన పేరు రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం మారుమ్రోగింది.
అయితే, ఇదంతా కొంతకాలం మాత్రమే. అవార్డు తిండిపెట్టదు కదా. మళ్లీ తన కష్టాన్ని నమ్ముకొని బతకడానికి సిద్ధపడ్డ దైతారికి చేసుకుందామంటే పని దొరకడం లేదు.పద్మశ్రీ అవార్డు అందుకొని ఎంతో కీర్తిని గడించిన ఆయనను తమ వద్ద పని ఇవ్వడానికి గ్రామస్థులు ముందుకురావడం లేదు.
ఆయనను ఎవరూ పనికి పిలవకపోవడంతో తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ఆయన ఏకంగా తన పద్మశ్రీ అవార్డునే తిరిగి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు.
తనకు పని దొరకకుండా చేసిన అవార్డు, ప్రతిష్ఠ తనకెందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే గుడిసెలో నివసిస్తున్న బైతారి నాయక్‌కు పద్మశ్రీ వచ్చినప్పుడు అనేకమంది నేతలు వచ్చి అనేక హామీలు ఇచ్చారు.
ప్రభుత్వ పథకంలో భాగంగా ఆయనకు పక్కా ఇల్లు కట్టిస్తామని, ఇంకా ఎన్నెన్నో చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ, ఏ ఒక్కటీ నెరవేరలేదు. ఇలా, పది మందిమంచి కోసం తపన పడే కష్టజీవికి ఇవాళ చేసుకుందామంటే పని కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. మరి, ప్రభుత్వం ఆయనను ఆదుకుంటుందా లేదా చూడాలి.


Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
an hour ago

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి
an hour ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
2 hours ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
2 hours ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
5 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
4 hours ago

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. సరే Prends ఉంటా
13 minutes ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
7 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
20 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
16-04-2021
ఇంకా