కుల్‌భూషణ్ జాదవ్ కేసు..తీర్పు ఎలా ఉండబోతుంది?
17-07-201917-07-2019 09:21:29 IST
2019-07-17T03:51:29.079Z17-07-2019 2019-07-17T03:51:23.602Z - - 10-04-2021

కుల్ భూషణ్ జాదవ్.. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుకోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ఇవాళ అంతిమ తీర్పురాబోతోంది. పాక్‌లో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న భారత మాజీ నేవీ అధికారి భవిష్యత్ ఏంటన్నది అంతర్జాతీయ న్యాయస్థానం ఇవాళ తేల్చనుంది. ఈ కేసులో ఇరుదేశాల వాదనలు విన్న ఇంటర్నేషనల్ కోర్టు... ఎవరివైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తి రేపుతోంది.
ఈ తీర్పుపై ఇటు కుల్‌భూషణ్ కుటుంబీకులతో పాటు భారతీయులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ దేశంపై గూఢచర్యం నిర్వహించారని, ఉగ్రవాదాన్ని ప్రేరేపించారని జాదవ్‌పై ఆరోపణలు చేసింది పాకిస్థాన్ మిలిటరీ కోర్టు. ఈ మేరకు అభియోగాలు మోపి ఉరిశిక్ష కూడా విధించింది. దీనిని భారత్ ఖండించింది. పాకిస్థాన్ విధించిన ఉరిశిక్షను తప్పుపడుతూ భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

కుల్ భూషణ్ జాదవ్ కేసులో భారత్, పాకిస్థాన్ వాద, ప్రతివాదనలను గతంలోనే వింది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం. ఈమేరకు బుధవారం తీర్పు వెల్లడించనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు సీజేఏ అబ్దుల్ అహ్మద్ యూసుఫ్ నేతృత్వంలోని 10 మంది సభ్యులు గల ధర్మాసనం తీర్పు ఇస్తుంది. కుల్ భూషణ్ విషయంలో పాకిస్తాన్ బుకాయింపులు ప్రదర్శించింది.
2016 మార్చి 3న .. ఇరాన్ నుంచి వస్తున్న అతడిని అరెస్ట్ చేసింది. బలూచిస్థాన్‌లో ఉన్న జాదవ్‌ను పాకిస్థాన్ మిలిటరీ అదుపులోకి తీసుకుంది. అయితే.. జాదవ్ కిడ్నాప్‌కు గురయ్యాడని భారత్ ఫిర్యాదు చేసింది. అయితే కుల్ భూషణ్ గురించి తమకు తెలియదని పాక్ అబద్ధాలాడింది. చివరకి తమదగ్గరే ఉన్నాడని, అయితే జాదవ్ తమ దేశంపై గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపించింది. వివిధ సాక్ష్యాలు ప్రవేశపెట్టింది. దీంతో ఆ కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది.ఈ విషయంపై 2017 మే 8న అంతర్జాతీయ న్యాయస్థానం మెట్లెక్కింది భారత్.
తమ మాజీ నేవీ అధికారిపై లేనిపోని ఆరోపణలు చేసిందని భారత్ సమర్థంగా వాదనలు వినిపించింది. వియన్నా ఒప్పందాన్ని పాకిస్థాన్ యధేచ్చగా ఉల్లంఘిస్తోందని గుర్తుచేసింది. భారత్ తరపున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు. ఈ వాదనలను న్యాయస్థానం పరిశీలించింది. బుధవారం అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై కుల్ భూషణ్ జాదవ్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.


ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
3 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
5 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
10 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా