కిరణ్ ఖేర్ విజయం ఖాయమట!
20-05-201920-05-2019 16:05:52 IST
Updated On 27-06-2019 13:47:38 ISTUpdated On 27-06-20192019-05-20T10:35:52.224Z20-05-2019 2019-05-20T10:35:50.312Z - 2019-06-27T08:17:38.123Z - 27-06-2019

మొదట టిక్కెట్ ఇవ్వడం కష్టమన్నారు. వేరే పార్లమెంట్ సీట్ చూసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చేశారు. కానీ పార్టీ అంతర్గత నివేదికలు, జనంలో ఉన్న అభిమానం చూసి, ఈ ఎన్నికల్లో కూడా ఆమెకే టిక్కెట్ ఇచ్చారు. ఇదంతా చెబుతోంది ఎవరి గురించి అంటే నటుడు అనుపమ్ ఖేర్ సతీమణి కిరణ్ ఖేర్ గురించే. 2014 ఎన్నికల్లో చండీగఢ్ ఎంపీ సీటు నుంచి గెలిచిన ఆమెను, ఈ ఎన్నికల్లో వేరే ప్రాంతం నుంచి బరిలో దింపాలని ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భావించారట. అయితే తనకు ఈ ఎన్నికల్లో కూడా చండీగఢ్ సీటు కేటాయించాలని కిరణ్ ఖేర్ తెగేసి చెప్పడంతో, రహస్యంగా ఆమె మీద నివేదిక తెప్పించారట. ఆ నివేదిక ప్రకారం కిరణ్ ఖేర్ మీద జనాభిమానం చాలా బాగా ఉందని తేలడంతో, ఈ ఎన్నికల్లో కూడా ఆమెను చండీగఢ్ పార్లమెంట్ సీటు నుంచే బరిలో దింపింది బీజేపీ. అంతేకాదు, ఈ ఐదేళ్లలో స్థానిక సమస్యలను పరిష్కరించడంలో చొరవ తీసుకున్న కిరణ్ ఖేర్, సినిమాలు, టీవీ సీరియళ్లకు చాలా దూరంగా ఉన్నారట. ఇది ఆమెకు చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇక ఆమె మీద కాంగ్రెస్ పార్టీ నుంచి పవన్ కుమార్ భన్సాల్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి హర్మోహన్ ధవన్ బరిలో దిగారు. గతంలో చండీగఢ్ ఎంపీ సీటు నుంచి నాలుగుసార్లు గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ భన్సాల్, ఈసారి కూడా కిరణ్ ఖేర్ మీద ఆరోపణలు గుప్పించారు. ఈ ఐదేళ్ల కాలంలో నియోజకవర్గ అభివృద్దికి ఏం చేశారని భన్సాల్ ప్రశ్నించారు. అయితే తాను చేసిన అభివృద్ధి పనుల మీద బహిరంగ చర్చకు తాను సిద్ధం అంటూ కిరణ్ ఖేర్ సవాల్ విసరడంతో నోరు మెదపలేదట. ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా చండీగఢ్ ఎంపీ సీటులో మరోసారి కిరణ్ ఖేర్ గెలవడం ఖాయమని తేల్చేశాయి.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
3 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
4 hours ago

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు
an hour ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
4 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
5 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
6 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
6 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021
ఇంకా