newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘కియా’ మోటార్స్ పై తమిళనాడు ఏమందంటే..?

06-02-202006-02-2020 17:28:25 IST
2020-02-06T11:58:25.753Z06-02-2020 2020-02-06T11:58:24.184Z - - 23-04-2021

‘కియా’ మోటార్స్ పై తమిళనాడు ఏమందంటే..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలోని అనంతపురంలో వున్న కియా మోటార్స్ తరలిపోతోందంటూ వస్తున్న వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు సైతం వైసీపీ వేధింపుల వల్లే అనేక కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతున్నాయని విమర్శించారు. దావోస్ సదస్సుకి ఏపీ ప్రభుత్వం ప్రతినిధే లేరన్నారు. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ నుంచి ఐటీ మంత్రి కేటీయార్ దావోస్ వెళ్ళివచ్చారని, హైదరాబాద్ లో వివిధ పరిశ్రమలు పెట్టడానికి గల అవకాశాలను వివరించి వచ్చారన్నారు. రాష్ట్రం నుంచి హోల్ సేల్ గా కంపెనీలను తరిమేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. 

ఇటు కియామోటార్స్ రెండోదశ కూడా ఏపీలో రాబోతోందని, తమిళనాడుకు వెళుతుందన్న వార్తలపై ఏపీ ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. తాజాగా దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ తమిళనాడుకు తరలిపోతుందన్న ప్రచారంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తాము కియా యాజమాన్యంతో టచ్‌లో లేమని.. వారితో ఎటువంటి సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో తాము సత్సంబంధాలే కోరుకుంటున్నామని పేర్కొంది. ఈ మేరకు తమిళనాడు పరిశ్రమల ప్రధాన కార్యదర్శి.. ఏపీ పరిశ్రమల కార్యదర్శికి ఫోన్‌ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. కియా పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరలిస్తున్నారంటూ రాయిటర్స్‌ పేర్కొన్న కథనాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించిన విషయం తెలిసిందే. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం ఈ వివాదంపై మాట్లాడారు. లోక్ సభలో దీనిపై చర్చ కూడా జరిగింది. టీడీపీ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   7 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle