newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాషాయమయంగా భారత్.. బీజేపీ ఇంతింతై వటుడింతై -2

04-06-201904-06-2019 16:48:43 IST
Updated On 04-06-2019 17:45:58 ISTUpdated On 04-06-20192019-06-04T11:18:43.180Z04-06-2019 2019-06-04T11:10:20.751Z - 2019-06-04T12:15:58.378Z - 04-06-2019

కాషాయమయంగా భారత్.. బీజేపీ ఇంతింతై వటుడింతై -2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

దేశంలో అతి పెద్ద రాష్ట్రమయిన యూపీలో బీజేపీ కొన్ని సీట్లు కోల్పోయినా అవి బీజేపీ మెజారిటీని అంతగా నష్టపరచలేదు. అక్కడ ఎస్పీ-బీఎస్పీ కూటమి వల్ల కొంత ఓట్ల శాతం బీజేపీ నష్టపోయింది. 80 లోక్ సభ సీట్లలో 62 సీట్లను మాత్రమే బీజేపీ గెలుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 304 సీట్లు గెలుచుకుంది. యూపీలో వచ్చిన వ్యతిరేక ఫలితాలను ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో సీట్లు సాధించడం ద్వారా పూడ్చుకోగలిగింది. 

Image may contain: text

బీజేపీ ఇంతటి అప్రతిహత విజయం సాధించడం వెనుక క్రెడిట్ అంతా నరేంద్రమోడీదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అన్ని రాష్ట్రాల్లో ఓటర్లు మోడీని మళ్లీ ప్రధానిగా చూడాలని భావించారు. అందుకే ఇంతటి విజయం కట్టబెట్టారు. ఇక్కడ మరో సంగతి కూడా మనం గమనించాలి. మోడీకి ధీటైన నాయకుడు, బీజేపీకి పోటీ ఇచ్చే ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవడం కూడా బాగా కలిసి వచ్చింది.  వివిధ నియోజకవర్గాల్లో బీజేపీకి ఓటేసిన వివిధ ఆదాయ వర్గాలను పరిశీలిస్తే అనేక అంశాలు తెరమీదకు వస్తాయి. 

Image may contain: text

దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు. నగరాల్లో బీజేపీ తన ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. 2009లో 353 నియోజకవర్గాల్లో 77 నియోజకవర్గాల్లో బీజేపీకి సీట్లు వచ్చాయి. అలాగే 2009లో 190 సీట్లలో బీజేపీకి ఓటేస్తే. 2019 ఈ సీట్ల సంఖ్య 207 కి పెరిగింది. 108 సెమీ-అర్బన్ నియోజకవర్గాల్లో 2009లో 20 సీట్లు, 2014లో 53 స్థానాలు, 2019లో 58 సీట్లు బీజేపీ సాధించింది. 

No photo description available.

అదే విధంగా 82 అర్బన్ నియోజకవర్గాల్లో 2009లో బీజేపీ గెలుచుకున్నవి 20 అయితే, 2014లో 40 స్థానాలు, 2019లోనూ 40 సీట్లు గెలుచుకుంది. 2014తో పోలిస్తే 2019లో కొత్త ఓటర్లు పెరగడం కారణం కావచ్చు. పాత ఓటర్లు బీజేపీని వ్యతిరేకించినా, కొత్త ఓటర్ల చేరిక వల్ల తారతమ్యం అంతగా లేకుండా పోయింది.

విద్యావంతులైన ఓటర్లు ఎక్కువగా ఉన్నచోట బీజేపీ ఓటు బ్యాంకు పెరగడం బాగా కలిసి వచ్చింది. బాగా చదువుకున్న వారు దేశం గురించి ఆలోచించడం, తాజా రాజకీయ పరిణామాలు, ఇతర పార్టీల బలబలాలను తెలుసుకోవడం వల్ల ప్రత్యామ్నాయం గురించి ఆలోచించలేదు. మోడీయే మళ్ళీ రావాలని వారంతా ఆశించి ఉండవచ్చు. 

2019 ఎన్నికలలో  కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కూడా విద్యావంతుల వల్ల పెరిగింది. అదే విధంగా బీజేపీకి ఓటేసిన విద్యావంతుల శాతం 31కి పెరిగింది. చదువుకున్నవారు అంతగా లేని చోట అంటే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ 22 శాతం ఓట్లు సాధిస్తే, బీజేపీ మాత్రం 42 శాతం సాధించడం విశేషం. 

Image may contain: text

2019 లోక్ సభ ఎన్నికలలో  అతి తక్కువగా ఉన్న ఓటర్లు కలిగిన 136 నియోజకవర్గాల్లో 92 చోట్ల బీజేపీ విజయకేతనం ఎగుర వేస్తే. కాంగ్రెస్ గెలుచుకున్నవి మాత్రం కేవలం 8 మాత్రమే. అలాగే బాగా చదువుకున్న ఓటర్లు కలిగిన 133 నియోజకవర్గాల్లో 59 చోట్ల బీజేపీ అభ్యర్ధులు గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది 30 సీట్లు మాత్రమే. బీజేపీ, కాంగ్రెస్ కాకుండా మిగిలిన పార్టీలు గెలిచింది 44 సీట్లు. 

No photo description available.

మరోవైపు ఎస్సీ. ఎస్టీ నియోజకవర్గాలున్న లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ ఓటు శాతం పెరిగింది. గతంలో ఆయాస్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యం చూపించేది. కానీ క్రమేపీ కాంగ్రెస్ ప్రభ ఈ స్థానాల్లో క్షీణించింది. 1984 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఇప్పుడు బీజేపీలో కనిపిస్తోంది.

No photo description available.

కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మినహా బీజేపీ జైత్రయాత్ర కొనసాగింది. ఏపీలో నోటా ఓట్ల కంటే బీజేపీకి పడిన ఓట్లు తక్కువంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏపీలో 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్లు కేవలం 3,03,099. మొత్తం ఓటు షేరింగ్ కేవలం 0.96 శాతం మాత్రమే. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓటు శాతం 0.84 శాతం అంటే 2 లక్షల 63 వేల 849 ఓట్లే వచ్చాయి. 

(గ్రాఫిక్స్ కర్టెసీ Mint Asia)

కాషాయమయంగా భారత్.. బీజేపీ ఇంతింతై వటుడింతై -1


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle