newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాషాయమయంగా భారత్.. బీజేపీ ఇంతింతై వటుడింతై -1

04-06-201904-06-2019 16:48:45 IST
Updated On 04-06-2019 17:46:16 ISTUpdated On 04-06-20192019-06-04T11:18:45.341Z04-06-2019 2019-06-04T11:07:10.534Z - 2019-06-04T12:16:16.657Z - 04-06-2019

కాషాయమయంగా భారత్.. బీజేపీ ఇంతింతై వటుడింతై -1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యావత్ భారత రాజకీయ ముఖచిత్రం రంగులు మారుతోంది. ఏడాదికి ఏడాది కాషాయం తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ ఇమేజ్‌కు యావద్భారతం జయజయధ్వానాలు చేసింది. ఎప్పట్లాగే నరేంద్రమోడీ సునామీ సృ‌ష్టించారు. దీంతో అల్లాడుతున్న కాంగ్రెస్ నామరూపాలు లేకుండా కొట్టుకుపోతోంది.  బీజేపీ ఒంటిచేత్తో 303 స్థానాల్లో కాషాయ జెండాను ఎగరేయడంతో చక్రం తిప్పుదామనుకున్న ప్రాంతీయ పార్టీల అడ్రస్ గల్లంతయ్యింది.

ఎన్డీయే పక్షాలతో కలిసి 352 సీట్లు కైవసం చేసుకోవడం జాతీయ రాజకీయాలను మార్చేసింది. కాంగ్రెస్ కేవలం 52 సీట్లను గెలుచుకుని పరువు దక్కించుకోవాల్సి వచ్చింది. పంజాబ్ మినహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కమలం పార్టీ పాగా వేసింది. 2014తో పోలిస్తే బీజేపీ ఈసారి మరింత పుంజుకుందని చెప్పాలి. నరేంద్ర మోదీ ప్రభంజనంతో ఢిల్లీతో సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో బీజేపీ జెండా రెపరెపలాడింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కాస్త పుంజుకున్నా.. లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి ఢీలా పడింది. గుజరాత్ లో బీజేపీ 26 సీట్లు గెలుచుకుని తమ సత్తా చాటింది.

అరుణాచల్ ప్రదేశ్ లో 2014లో 4 స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈసారి కూడా మొత్తం స్థానాలను కైవసం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్, ఇతరులు పూర్తిగా చతికిలపడ్డాయి. అటు ఉత్తరాఖండ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ 5 స్థానాలను కైవసం చేసుకున్నది. ఇక్కడ ఏపార్టీకూడా బీజేపీ పోటీనివ్వలేకపోయింది. రాజస్థాన్ లో బీజేపీ, ఎన్డీయే భాగస్వామి ఆర్ఎల్పీ మొత్తం 25 స్థానాలను గెలుచుకున్నాయి. ఆర్నెళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అధికారాన్ని చేపట్టినా లోక్ సభ ఫలితాల్లో మాత్రం ఆ మార్కు కనిపించకపోవడం గమనించాల్సిన అంశం. 

ఢిల్లీలో మొత్తం 7 స్థానాలను బీజేపీ తమ ఖాతాలో వేసుకుంది. నాగాలాండ్ లో ఉన్న ఒక్క సీటును ఎన్డీయే భాగస్వామి పార్టీ కైవసం చేసుకుంది. ఇక త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలను ఓడించిన బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో రెండు సీట్లలో విజయం సాధించింది. డామన్ డయ్యూ, చండీగడ్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో సైతం ఒక్కోసానాన్ని కమలం పార్టీ కైవసం చేసుకుంది.

బీజేపీ ఓటింగ్ శాతం 2019లో భారీగా పెరిగింది. 2009లో కేవలం 20 శాతం ఉన్న ఓటింగ్ శాతం కేవలం పదేళ్ళలో 2019 నాటికి 39.5 శాతానికి పెరిగింది. 2014లో బీజేపీ ఓటు శాతం 30 ఉంటే అది ఐదేళ్ళలో 39.5 శాతానికి చేరింది.  ఓటింగ్ శాతం పెరగడానికి ప్రధాన కారణంగా కాంగ్రెస్ ఓటు శాతం క్రమంగా తగ్గిపోవడమే అని చెప్పాలి. 2009లో కాంగ్రెస్ ఓటు శాతం 28 ఉంటే.. అది 2019 నాటికి 22 శాతానికి పడిపోయింది. 

No photo description available.

దేశంలో గెలిచిన అభ్యర్ధుల మెజారిటీ కూడా 2019లో బాగా పెరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతిసారీ తమకు ఎక్కువమంది మద్దతు కావాలని కోరారు. ముఖ్యంగా నూతనంగా ఓటు హక్కు వచ్చినవారి ఎక్కువభాగం ఓట్లు బీజేపీకి పడ్డాయి. దీనివల్ల బీజేపీ బాగా లాభపడింది. 

No photo description available.

దేశంలో ఎక్కువగా పోలైన ఓట్లు అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చాయి. కొన్ని రాష్ట్రాల్లో పెరిగిన పోలింగ్ శాతం బీజేపీకి లాభించింది.  కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు తారతమ్యం చూపించారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ కు ఓటేసిన వారు, లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీకి చోటిచ్చారని చెప్పాలి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఆర్నెళ్ళ క్రితమే జరిగాయి. అయితే అప్పుడు కాంగ్రెస్ ను గెలిపించిన ఓటర్లే జాతీయ స్థాయిలో లోక్ సభ ఎన్నికల వేళ మోడీవైపు మొగ్గారు. కాంగ్రెస్ ఈరాష్ట్రాల్లో రెండేసి సీట్లు సాధించగలిగింది. 

(ఇంకా ఉంది)

(గ్రాఫిక్స్ కర్టెసీ Mint Asia)

కాషాయమయంగా భారత్.. బీజేపీ ఇంతింతై వటుడింతై -2

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   12 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   13 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   16 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   19 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   14 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle