newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాశ్మీర్ మునిసిపోల్స్ చెబుతున్నదేమిటి?

29-10-201929-10-2019 12:45:10 IST
2019-10-29T07:15:10.441Z29-10-2019 2019-10-29T07:13:40.266Z - - 12-04-2021

కాశ్మీర్ మునిసిపోల్స్ చెబుతున్నదేమిటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జమ్మూ కాశ్మీర్ లో నిర్బంధం తారస్థాయిలో ఉందన్న వార్తలలో వాస్తవం లేదా? కాశ్మీర్ లో ప్రజాస్వామ్య హక్కులను సమాధి చేస్తున్నారంటూ విపక్షాల విమర్శలు పూర్తిగా రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేస్తున్నవేనా? జమ్మూ కాశ్మీర్ లో స్థానిక ఎన్నికల పోలింగ్ శాతాన్ని పరిగణనలోనికి తీసుకుంటే అక్కడ ప్రజల హక్కులకు భంగం కలిగే పరిస్థితులు లేవనీ, అక్కడి పరిస్థితుల గురించి వస్తున్న విమర్శలు, భయాలు, అందోళనలు అన్నీ ఉత్తివేనని అనిపించక మానదు.

స్థానిక ఎన్నికలలో ఏకంగా 98శాతం పోలింగ్ నమోదు కావడం నిజంగా ఒక చరిత్ర. అన్ని సక్రమంగా ఉన్నాయనే రాష్ట్రాలలోనే పోలింగ్ శాతం 75శాతం మించితే భారీ పోలింగ్ అని చెప్పుకుంటాం. అలాంటిది, నిత్య రావణ కాష్టంలా రగులుతున్న జమ్మూ కాశ్మీర్ లో పోలింగ్ శాతం 98శాతం నమోదైందంటే అక్కడి ప్రజలు ప్రజా స్వామ్యం పట్ల చూపుతున్న విశ్వాసానికి నిదర్శనంగా చెప్పాల్సి ఉంటుంది. 

జమ్మూ కాశ్మీర్, లేహ్, లడక్ లలో బ్లాక్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికలు జరగడం ఇదే తొలి సారి. అక్టోబర్ 24న జరిగిన ఈ ఎన్నికలలో జనం అత్యంత ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు వేశారు. 310 బ్లాక్ లకు ఎన్నికలు జరిగితే బరిలో 1080 మంది నిలిచారు. 98శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ ఎన్నికలు జరిగే పరిస్థితి రావడానికీ, ఎన్నికలు జరగడానికి, ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఒకే ఒక కారణం అని చెప్పాలి. అది జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిన కల్పించే ఆర్టికల్ 370 రద్దు. ఏడు దశాబ్దాలుగా నిత్య మారణహోమంగా రగులుతున్న రాష్ట్రంలో ఈ నిర్ణయం ద్వారా శాంతి నెలకొంటుందన్న భావన సర్వత్రా వ్యక్తమైంది. అందుకే కేంద్రం నిర్ణయానికి నాయకులు పార్టీ విధానాలకు అతీతంగా సానుకూలంగా స్పందించారు. అయితే రద్దు తరువాత నిరవధికంగా కొనసాగుతున్న ఆంక్షల పర్వం ఆర్టికల్ 370 రద్దు వల్ల ఒరిగిందేమిటి? అన్న ప్రశ్నలు లేవనెత్తాయి. 

ఆర్టికల్ 370 రద్దు తరువాత రాష్ట్రంలో హింసాకాండ తగ్గింది. ఉగ్ర చర్యలు దాదాపు ఆగిపోయాయి. అయితే ఉగ్ర ముప్పు భయం మాత్రం తొలగలేదు. ఇందుకు పొరుగు దేశం ప్రొద్బలంతో ఉగ్ర చొరబాట్లకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న నిఘా సంస్థల హెచ్చరికలే కారణం. అయితే కేంద్రం సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం కారణంగా దశాబ్దాలుగా ఉగ్ర పడగ నీడన గడిపిన కాశ్మీరీలకు నిఘా హెచ్చరికలు, భద్రతాదళాల పహారాలు కొత్త కాదు. అందుకే కాశ్మీర్ లో బ్లాక్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికలకు జనం నుంచి అనూహ్య రీతిలో సానుకూల స్పందన వచ్చిందని చెప్పాలి.

తమ నేతలను ఎలాంటి ఒత్తిడులూ లేకుండా ఎన్నుకునే అవకాశాన్ని వారు జారవిడుచుకోదలచుకోలేదన్న విషయం ఈ ఎన్నికలలో ఓటు వేయడానికి వారు చూపిన ఉత్సాహమే తార్కానం. ఇక ఈ ఎన్నికలలో బీజేపీ ఏమీ ఘన విజయాలు సాధించలేదు. మొత్తం స్థానాలలో స్వతంత్రులు 200కు పైచిలు స్థానాలలో విజయ భేరి మోగిస్తే బీజేపీ గెలిచినవి 81 మాత్రమే. 

కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి. ఆ పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరూ పోటీలో లేరు. అయితేనేం జనం వాటి బహిష్కరణను గుర్తించలేదు. గౌరవించలేదు. స్వచ్ఛందంగా పోటీలో ఉన్నవారిలోనే తమకు నచ్చిన వారికి ఓటేశారు. ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని చాటారు. కాశ్మీర్ లో సాధారణ స్థితి ఏర్పడేందుకు, ప్రగతి పరుగులు పెట్టేందుకు ఇక ఎంతో కాలం పట్టదని ఈ ఎన్నికలకు ప్రజలు స్పందించిన తీరును బట్టి అర్ధమౌతున్నది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle