newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

17-02-202017-02-2020 08:58:40 IST
2020-02-17T03:28:40.691Z17-02-2020 2020-02-17T03:28:36.987Z - - 11-04-2021

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యంపై భారత్ ఘాటుగా స్పందించింది. జమ్ముకశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్స్‌ చేసిన ప్రతిపాదనను భారత్‌ తీవ్రంగా పరగణించింది. కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి సుముఖంగా లేమని, పొరుగుదేశం బలవంతంగా, అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఖాళీ చేసేలా దృష్టిసారించాలని కోరింది.

కాగా జమ్ము కశ్మీర్‌లో పరిణామాలపై తాను తీవ్రంగా కలత చెందానని, ఇరు దేశాలు అంగీకరిస్తే కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని ఐరాస చీఫ్‌ గుటెర్స్‌ పాక్‌ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై భారత్‌ ఘాటుగా బదులిచ్చింది. 

జమ్మూ కశ్మీర్‌పై తమ విధానంలో ఎలాంటి మార్పూ లేదని, కశ్మీర్‌ భారత్‌ అంతర్భాగమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఈ అంశంలో ద్వైపాక్షిక సంప్రదింపులు మినహా మరెవరి జోక్యానికీ తావు లేదని తేల్చిచెప్పారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదం నిర్మూలించే దిశగా చర్యలు చేపట్టాలని కోరింది. కాశ్మీర్ అంశాన్ని ఎలాగైనా అంతర్జాతీయ దృష్టికి తేవాలని పాకిస్తాన్ కుయుక్తులు పన్నుతూనే వుంది.

గత నెలలో భద్రతామండలిలో కశ్మీర్‌ అంశాన్ని మరోసారి లేవనెత్తేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్‌కు అవమానం ఎదురైంది. చైనా సాయంతో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించేందుకు పాక్‌ ప్రయత్నించింది, కానీ మండలిలో మిగిలిన సభ్యులెవరూ పాక్ కు మద్దతివ్వక పోవడంతో ఏకాకిగా మిగిలిపోవల్సి వచ్చింది. కశ్మీర్‌ అంశం ద్వైపాక్షికమైనందున దానిపై చర్చించడం కుదరదని, మండలిలోని ఇతర సభ్యులు ఖరాఖండీగా చెప్పేశారు.

ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావాలంటే పాకిస్తాన్‌ తనకు కష్టమైన చర్యలు చేపట్టాల్సిందేనని భారత్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు అన్ని దేశాలు కలిసి రావాలని భారత్ ప్రధాని మోడీ అంతర్జాతీయ వేదికలనుంచి పిలుపునిస్తూనే వున్నారు. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   17 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   16 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   20 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle