newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

04-06-202004-06-2020 08:23:09 IST
Updated On 04-06-2020 09:58:00 ISTUpdated On 04-06-20202020-06-04T02:53:09.434Z04-06-2020 2020-06-04T02:52:58.044Z - 2020-06-04T04:28:00.472Z - 04-06-2020

కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘించడం, సరిహద్దుల్లో కాల్పులు జరపడం పాకిస్తాన్ కు ఎప్పటినుంచో అలవాటే. ఒకవైపు ప్రపంచదేశాలు కరోనా వైరస్ తో యుద్ధం చేస్తున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం కవ్వింపులకు పాల్పడుతూనే వుంది. తాజాగా కాశ్మీర్‌లో భద్రతా బలగాలు తీవ్రవాదులపై పై చేయి సాధించాయి. కశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు కీలక వ్యూహాకర్త అని భావిస్తున్న ఫౌజీభాయ్ భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించాడు.

 పాకతో ఉన్న నియంత్రణ రేఖ వద్ద జరుగుతున్న అల్లర్లకూ మూలం ఇతడేనని గుర్తించారు. 2019లో జరిగిన పుల్వామా దాడికి ప్రధాన వ్యూహాకర్త కూడా ఫౌజీభారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్‌ టాప్‌ కమాండర్‌గా ఫౌజీభారు .. కశ్మీర్‌లో అనేక ఆపరేషన్లు చేపట్టాడు. అయితే బుధవారం పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఫౌజీభాయ్ ని  భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దక్షిణ పుల్వామాలోని కంగన్‌ గ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఫౌజీభారు హతమయ్యాడు. జైషే మిలిటరీ చీఫ్‌ అబ్ధుల్‌ రౌఫ్‌ అస్గర్‌ ఇతన్ని రిక్రూట్‌ చేశాడు. 2018లో పాకిస్తాన్ ఇతడిని భారత్‌లోకి పంపించినట్లు తెలుస్తోంది. 

కశ్మీర్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసుల రికార్డులో ఫౌజీభాయ్ కు  పలుపేర్లు ఉన్నాయి. ఫౌజీభారు, అబ్దుల్‌ రెమ్మాన్‌, ఇద్రిస్‌, హైదర్‌, లంబూ అనే పేర్లతో అతన్ని పిలుస్తుంటారు. బుధవారం న ఎన్‌కౌంటర్‌లో ఇద్రిస్‌తో పాటు జాహిద్‌ మన్జూర్‌ వాణి, మన్జూర్‌ అహ్మద్‌ కార్‌లు కూడా హతమయ్యారు. 2017లో ఈ ఇద్దరూ జైషేలో చేరారు. కాశ్మీర్‌ ఐజీ విజయ్ కుమార్‌ నేతృత్వంలో సాగిన ఇంటెలిజెన్స్‌ ఆపరేషన్‌ ద్వారా ఫౌజీభాయ్ సమాచారం బహిర్గతమైంది. 

తన ఆపరేషన్స్‌ కోసం ఫౌజీభారు మొబైల్‌ ఫోన్‌ ఆపరేట్‌ చేయలేదు. ఇతర కమర్షియల్‌ నెట్‌వర్క్స్‌ను కూడా అతను వినియోగించలేదు. కేవలం నమ్మకమైన కొరియర్ల ద్వారానే అతను సమాచారం చేరవేసేవాడని భద్రతాదళాలు తెలిపాయి. ఎన్‌క్రిప్ట్‌ చేసిన శాటిలైట్‌ ఫోన్‌సెట్‌తోనే ఫౌజీభారు ఉగ్ర సంస్థ జైషేతో సంప్రదించేవాడని తేలింది. స్థానిక తెగలను సూసైడ్‌ దాడులకు ప్రోత్సహించడంలోనూ ఫౌజీభాయ్ కీలకంగా వ్యవహరించాడు.

అప్జల్‌ గురు నేతృత్వంలో ఈ ఆపరేషన్‌ జరిగింది. పుల్వామాలో గత వారం పేలుడు పదార్దాలతో ఉన్న ఓ కారును సీజ్‌ చేశారు. అయితే ఆ కారు డైవర్‌ను ఎవరు రిక్రూట్‌ చేశారన్న కోణంలోనూ విచారణ సాగుతోంది. దీనివెనుక కూడా ఫౌజీబాయ్ హస్తం ఉండి ఉండవచ్చని ఇంటెలిజెన్స్‌ అనుమానిస్తోంది. మొత్తం మీద భద్రతాదళాలు కాశ్మీర్లో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఫౌజీ బాయ్ అనుచరులపై భద్రతాదళాలు కన్నేశాయి. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   4 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   8 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   9 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle