కాశ్మీర్లో ఉగ్రఘాతుకం.. బీజేపీ నేత కుటుంబంపై కాల్పులు
09-07-202009-07-2020 08:34:24 IST
Updated On 09-07-2020 10:42:05 ISTUpdated On 09-07-20202020-07-09T03:04:24.250Z09-07-2020 2020-07-09T03:04:17.576Z - 2020-07-09T05:12:05.706Z - 09-07-2020

జమ్మూ కాశ్మీర్ లో కలకలం రేగింది. ఉగ్రవాదులు రాజకీయనేతలను టార్గెట్ చేశారు. ఇటీవల పార్టీలో చేరిన బీజేపీ నేత షేక్ వాసిం బరీ తో పాటు తండ్రి, సోదరుడిని కాల్చి చంపారు. బాండిపొరా జిల్లాలో జరిగిన ఈ ఘటనపై భద్రతాదళాలు అప్రమత్తం అయ్యాయి. వాసిం బరీ తన తండ్రి బషీర్ అహ్మద్, సోదరుడు ఉమర్ బషీర్ ఓ హోటల్ ముందు కూర్చుని టీ తాగుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. హోటల్ లో వున్న వీరిపై రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపి పరారయ్యారు. అక్కడకుచేరుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ముగ్గురు చనిపోయారు. బీజేపీ నేత అయిన షేక్ వాసిం బరీపై ఉగ్రవాదులు కన్నేశారు. దీంతో ఆయనకు రక్షణగా గార్డుల్ని నియమించింది ప్రభుత్వం. అయితే ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. వాసిం కుటుంబానికి 8 మంది భద్రతా సిబంది రక్షణగా ఉన్నారని కానీ కాల్పులు జరుపుతున్న సమయంలో ఒక్కరూ అక్కడ లేరని పోలీసులు అంటున్నారు. తమ విధుల్లో నిర్లక్ష్యం వహించిన గార్డులను అరెస్ట్ చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. కాశ్మీర్ ఘటనపై ప్రధానిమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ ట్వీట్ చేశారు. వాసిం మరణం పార్టీకి తీరని లోటని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆవేదన వ్యక్తం చేశారు.అంతే కాకుండా జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.షేక్ వాసిం బరీ ఈప్రాంతంలో చురుకైన బీజేపీ నేతగా ఎదిగారు. ఈ మధ్యకాలంలో కాశ్మీర్లో తీవ్రవాదుల కదలికలు పెరిగిపోవడంతో పాటు భద్రతా దళాలు కూడా కాల్పులు జరుపుతున్నాయి. ఎన్ఐఏ అధికారులు ఈప్రాంతంలో ఉగ్రవాదుల సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. దీంతో బీజేపీ నేతలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
3 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
4 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
4 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
8 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
9 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
7 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
10 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
10 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
5 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
12 hours ago
ఇంకా