కాన్షీరామ్ డెత్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
30-08-201930-08-2019 08:56:25 IST
Updated On 30-08-2019 09:26:50 ISTUpdated On 30-08-20192019-08-30T03:26:25.333Z30-08-2019 2019-08-30T03:16:07.333Z - 2019-08-30T03:56:50.530Z - 30-08-2019

యూపీ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం. ఎవరు ఎప్పుడు ఎలాంటి కామెంట్లు చేస్తారో ఎవరికీ తెలీదు. తాజాగా ఉత్తరప్రదేశ్ బీజేపీ మంత్రి గిరిరాజ్ సింగ్ ధర్మేష్ బీఎస్సీ అధినేత్రి మాయావతిపై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీ రామ్‌ది సహజ మరణం కాదంటూ బాంబు పేల్చారు. కాన్షీరామ్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారని, అందుకు కారణం ఎవరో కూడా మంత్రి చెప్పుకొచ్చారు.అప్పట్లో మాయావతి పర్యవేక్షణలోనే ఆయనకు వైద్య చికిత్స జరిగిందని, కాన్షీ రామ్‌ను మాయావతే చంపిందని ఆయన సోదరి చెప్పిందన్నారు. ఈ నేపథ్యంలో కాన్షీ రామ్ మృతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మంత్రి సీఎంను కోరడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. మాయావతి గాల్లో వేలాడే కరెంటు తీగ లాంటి వ్యక్తని, ఎవరూ ముట్టుకున్నా చనిపోవడం ఖాయమన్నారు గిరిరాజ్ సింగ్. బీజేపీ ఆమెను మూడుసార్లు ముఖ్యమంత్రిని చేసి కాపాడిందని.. కానీ ఆమె మాత్రం బీజేపీకి ద్రోహం చేసిందని మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం యూపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా అవుతున్నాయి. గతంలో మోడీపై మాయావతి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే మాయావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాయావతి పెళ్లి చేసుకోని కారణంగా.. ఆమెకు కుటుంబ విలువ గురించి తెలియదన్నారు. ఒకవేళ మాయావతి పెళ్లి చేసుకుని ఉంటే భర్తతో ఎలా మెలగాలో తెలిసి ఉండేదన్నారు.దళిత మహిళలపై దాడులు జరిగినా మాయావతి ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపీ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. తాజా విమర్శలపై మాయావతి ఏమంటారో చూడాలి.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
9 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
12 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
15 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
5 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
15 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
13 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
16 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
16 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
10 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
19 hours ago
ఇంకా