newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాంగ్రెస్ షాప్ మూసేద్దామా చిదంబరంజీ: షర్మిష్ట కౌంటర్

12-02-202012-02-2020 16:31:20 IST
Updated On 12-02-2020 16:42:01 ISTUpdated On 12-02-20202020-02-12T11:01:20.312Z12-02-2020 2020-02-12T11:01:16.774Z - 2020-02-12T11:12:01.301Z - 12-02-2020

కాంగ్రెస్ షాప్ మూసేద్దామా చిదంబరంజీ: షర్మిష్ట కౌంటర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నూట పాతికేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో ఘోరపరాజయంపై స్పందించడానికి కూడా శక్తి లేనట్లుగా చేష్టలుడిగిపోయింది. పైగా తాను ఓడిన బాధకంటే తన బద్దశత్రువైన బీజేపీ కూడా అధికారానికి దూరం కావడమే కాంగ్రెస్ పార్టీకి ఇంకా సంతోషం కలిగిస్తున్నట్లుంది. అందుకే తమ ఓటమిని విస్మరించి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన అఖండ విజయాన్ని కీర్తించడంతోనే కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి సమయం గడచిపోతోంది. రాహుల్, ప్రియాంకకు తోడుగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం కూడా ఆప్ అధినేత కేజ్రీవాల్ సాధించిన ఘనతపై ప్రశంసల వర్షం కురిపించేశారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ జాతీయ వ్యాఖ్యాతలకు కూడా ఏమాత్రం సరిపడనట్లు ఉంది. అందుకే మన పార్టీ సంగతి మర్చిపోయి ఇతర పార్టీలకు బీజేపీని ఓడించే లక్ష్యాన్ని ఔట్ సోర్స్‌‍ పనికింద అప్పగించేశామా.. అయితే ఇక ఎందుకు మన దుకాణం.. రాజకీయాల్లోంచి ఎత్తేసుకుందామా అంటూ చిదంబరం వ్యాఖ్యలకు కౌంటర్ వేస్తున్నారు కాంగ్రెస్ వాదులు.

తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం నేపథ్యంలో జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఘోరపరాజయం పట్ల కాంగ్రెస్ జాతీయ వ్యాఖ్యాత షర్మష్ట ముఖర్జీ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. సీనియర్ నాయకుడు పి. చిదంబరం ఆప్ విజయాన్ని శ్లాఘించడంతో ఆగ్రహించిన షర్మిష్ట ఆయనపైకూడా ట్వీట్‌ను సంధించారు. బీజేపీని ఓడించే అవకాశాన్ని ప్రాంతీయ పార్టీలకు ఎప్పుడు అవుట్ సోర్స్ కింద ఇచ్చేశామో చెప్పండి అంటూ మండిపడ్డారు.

మిమ్మల్ని గౌరవిస్తూనే ఒక విషయం మీనుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నాను చిదంబరంజీ.. బీజేపీని ఓడించే ప్రథమ కర్తవ్యాన్ని కాంగ్రెస్ ఇతర పార్టీలకు ఎప్పుడు అవుట్ సోర్స్‌ కింద ఇచ్చేసిందో తెలుసుకోవాలని ఉంది. అలా ఇవ్వని పక్షంలో మన పరాజయాన్ని విశ్లేషించుకోవడం మాని ఆప్ ఘన విజయాన్ని ఎందుకు ప్రశంసిస్తున్నట్లో చెప్పండి. మనం సాధించాల్సిన విజయాన్ని ఇతర పార్టీలకు అప్పగించడం నిజమే అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ యూనిట్లను మూసేసుకోవడమే ఉత్తమం అంటూ షర్మిష్ట ట్వీట్ చేశారు.

ఢిల్లీలో మనం మరోసారి ఘోరపరాజయం పొందాం. ఓటమికి కారణాల శోధన ఆపేద్దాం. కార్యాచరణలో దూకాల్సిన సమయం వచ్చింది, అగ్రనాయకత్వం నిర్ణయాలు తీసుకోవడంలో జాగు సేయడం, రాష్ట్ర స్థాయిలో వ్యూహం, ఐక్యత సాధించలేకపోవడం, ప్రేరణ లేని కార్యకర్తలు, క్షేత్రస్థాయిల్లో సంబంధాలు కోల్పోవడం అన్నీ మన పరాజయానికి కారణాలే. వ్యవస్థలో భాగంగా నా వంతు బాధ్యతను తీసుకుంటున్నాను అని షర్మిష్ట వ్యాఖ్యానించారు. 

బీజేపీ విభజన రాజకీయాలను ప్రదర్శిస్తోంది. కేజ్రీవాల్ స్మార్ట్ పాలిటిక్స్‌ను అవలంబిస్తున్నారు. మరి మనం ఒక పార్టీగా ఏం చేశాం. మన ఇంటిని చక్కదిద్దుకోవడానికి నిజాయితీ ఏం చేశాం అన్నది తేలాలి. దీనికి బదులుగా ఇతర పార్టీలు భారత్‌ను కైవసం చేసుకుంటూంటే మనం మాత్రం కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకోవడం ఎలాగనే పోరాటంలో బిజీగీ ఉంటున్నాం. మనం బతికి బట్టకట్టాలంటే ఇకనైనా సొంత గుహల్నుంచి బయటకు రావాలి అంటూ షర్మిష్ట  కాంగ్రెస్ నాయకత్వానికి సూచించారు. షర్మిష్ట తండ్రి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం పలు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసిన విషయం తెలిసిందే

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle