newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాంగ్రెస్ ప్రచారానికి ‘స్టార్లు’ దూరం! – కారణమిదేనా?

21-10-201921-10-2019 09:59:08 IST
2019-10-21T04:29:08.520Z21-10-2019 2019-10-21T04:28:46.621Z - - 10-04-2021

కాంగ్రెస్ ప్రచారానికి ‘స్టార్లు’ దూరం! – కారణమిదేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారానికి నిన్నటితో తెరపడింది. బీజేపీ, కాంగ్రెస్ లు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే బీజేపీ ప్రచారంలో మెరుపులు మెరిపిస్తే...ఛరిష్మా ఉన్న నేతల ప్రచారం కరవై కాంగ్రెస్ దిగాలు పడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల్లోనూ, శ్రేణుల్లోనూ కూడా నిస్తేజం ఆవరించింది. ఆ ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదా అన్నట్లుగా మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రచారం సాగింది.

కాంగ్రెస్ లో చరిష్మా కలిగిన నేతలు ఎవరైనా ఉన్నారంటే వారు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మాత్రమే. స్థానిక నేతలు, స్టార్ క్యాంపెయినర్లు మేధావులూ ఎందరున్నా గాంధీ నెహ్రూ కుటుంబీకులకు ప్రజలలో ఉన్న ఆదరణ, క్రేజ్, ఛరిష్మాయే వేరు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వీరి ప్రచారం లేకపోవడంతో కాంగ్రెస్ క్యాంపెయిన్ కళ తప్పిందనే చెప్పాలి.

గత సార్వత్రిక ఎన్నికలలో దేశ మంతా తానొక్కడే అన్నట్లుగా ప్రచార బాధ్యతలను తన భుజస్కంధాలపై మోసిన రాహుల్ గాంధీ..ఆ ఎన్నికలలో పరాజయంతో కాడి వదిలేశారు. పార్టీ మొత్తం ప్రాధేయ పడినా సారథ్య బాధ్యతలను తీసుకోవడానికి ససేమిరా అన్నారు. అనివార్యంగా ఆరోగ్యం సహకరించకున్నా సోనియా గాంధీయే పార్టీ  తాత్కాలిక సారథిగా పగ్గాలు అందుకున్నారు.

ఆమె పార్టీ బాధ్యతలను చేపట్టాక జరుగుతున్న తొలి ఎన్నికలు. కానీ ఎన్నికలకు పార్టీని, క్యాడర్ ను సమాయత్తం చేయడంలో...పార్టీ ప్రచార వ్యూహాన్ని రూపొందించడంలో ఆమె క్రీయాశీలంగా వ్యవహరించలేదు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె ఒక్కటంటే ఒక్క ఎన్నికల ప్రచార సభలో కూడా ప్రసంగించలేదు. అలాగే పార్టీలో ఛరిష్మాగలిగిన యువనేతగా రాహుల్ గాంధీ కూడా ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ తరఫున విస్తృత ప్రచారం చేయలేదు. రెండు రాష్ట్రాలలోనూ కలిపి కేవలం ఏడంటే ఏడు సభలలో మాత్రమే పాల్గొన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆశాదీపంగా కనిపిస్తున్న ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నారు. రెండు రాష్ట్రాలలో కనీసం ఒక రాష్ట్రంలోనైనా ఆమె ప్రచార సారథ్యం చేపడతారని పార్టీ క్యాడర్ ఆశించారు. అయితే అలా జరగలేదు. ఇక పార్టీలో స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న వారిలో చాలా మంది అసలీ రెండు రాష్ట్రాల వైపూ కన్నెత్తి చూడలేదు. సోనియా గాంధీ ప్రచారానికి దూరంగా ఉన్నారంటే ఆరోగ్య సమస్య అనుకోవచ్చు. మిగిలిన వారు కూడా దూరంగా ఉండటంతో పార్టీలో విజయ కాంక్ష ఇసుమంతైనా లేదనడానికి తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అదే సమయంలో అధికార బీజేపీ అగ్రనేతలు అలుపెరుగకుండా ఇరు రాష్ట్రాలలోనూ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రెండు రాస్ట్రాలలోనూ కలిపి మొత్తం పాతిక ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగించారు. అమిత్ షా కూడా ఇరు రాష్ట్రాలలోనూ విస్తృతంగా పర్యటించారు. వీరంతా కూడా ఆర్టికల్ 370 రద్దు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్, అంతర్జాతీయంగా పాక్ ను ఒంటిరిని చేయడంలో సాధించిన విజయం వంటి అంశాలపై ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. ఆ ప్రసంగాల ముందు నిరుద్యోగం, సమాజంలో చీలిక వంటి అంశాలపై రాహుల్ చేసిన ప్రసంగాలు వెలవెలబోయాయనే చెప్పాలి.  

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle