కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా ఎన్నిక
01-06-201901-06-2019 17:37:17 IST
Updated On 25-06-2019 12:18:40 ISTUpdated On 25-06-20192019-06-01T12:07:17.854Z01-06-2019 2019-06-01T12:07:11.854Z - 2019-06-25T06:48:40.680Z - 25-06-2019

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది కాంగ్రెస్. దీంతో నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ నేతల్లో మళ్ళీ జోష్ పెంచే పనిలో పడ్డారు సోనియా గాంధీ. భవిష్యత్తులో కాంగ్రెస్ అనుసరించాల్సిన కార్యాచరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా శనివారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ పార్లమెంటు సెంట్రల్ హాలులో భేటీ అయింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియాగాంధీని పార్టీ ఎంపీలు ఎన్నుకున్నారు. అలాగే ఇకపై పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో సోనియా నాయకులకు దిశానిర్దేశం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియా పేరును ప్రతిపాదించగా ఎంపీలంతా సోనియాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సోనియా నాయకత్వాన్ని బలపరచాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అంటున్న సమయంలో పార్టీ సీనియర్లంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు లోక్ సభలో ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. దీంతో విపక్షనేత ఎవరనేది తేలలేదు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంపై రాహుల్ పట్టువీడని నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సందర్భంగా రాహుల్ పనితీరును సోనియా ప్రశంసించారు. పార్టీ గెలుపు కోసం ఆయన ఎంతో శ్రమించారన్నారు. పార్టీని కాపాడుకోవాలన్నారు. ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పరాభవం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం నాడు మాట్లాడారు. ఇవాళ జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన కొత్త ఎంపీ లను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ఎంపీలను ఉత్సాహ పరుస్తూ పార్టీలో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. లోక్ సభలో బీజేపీని ఎదుర్కొనేందుకు 40 మంది చాలని అయితే ఇప్పుడు మనం 52 మంది ఉన్నామన్నారు. సభలో మాట్లాడడానికి రెండు నిమిషాలు కంటే ఎక్కువ సమయం కాంగ్రెస్ సభ్యులకు రాకపోవచ్చని, వచ్చిన ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు రాహుల్. సంఖ్యాబలం తక్కువగా ఉన్నా బీజేపీ పై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఎన్నికల్లో పార్టీకి దన్నుగా నిలిచిన కార్యకర్తలు,ఓటర్లకు రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
30 minutes ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
an hour ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
4 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
2 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
5 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
19 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
a day ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
20 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
16-04-2021

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
a day ago
ఇంకా