newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌కు ట్రబుల్స్.. శివకుమార్ అరెస్ట్

04-09-201904-09-2019 09:34:06 IST
Updated On 05-09-2019 15:44:54 ISTUpdated On 05-09-20192019-09-04T04:04:06.424Z04-09-2019 2019-09-04T04:03:43.529Z - 2019-09-05T10:14:54.806Z - 05-09-2019

కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌కు ట్రబుల్స్.. శివకుమార్ అరెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్నాటక కాంగ్రెస్ నేత, ట్రబుల్ షూటర్ డికె శివకుమార్ అరెస్టయ్యారు. నాలుగు రోజుల విచారణ తర్వాత అదుపులోకి తీసుకుంది ఈడీ. హవాలా లావాదేవీల నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌చేసింది. శివకుమార్‌ను తమ కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉన్నందున అరెస్ట్‌ చేశామని ఈడీ తెలిపింది. కోర్టులో ప్రవేశపెట్టి తమ కస్టడీకి అప్పగించాలని కోరతామంటోంది ఈడీ.  

తనను అరెస్ట్‌ చేయాలన్న లక్ష్యాన్ని బీజేపీ మిత్రులు విజయవంతం చేసుకున్నారని వారిని అభినందిస్తున్నానని ట్వీట్‌ చేశారు శివకుమార్. ‘నాకు వ్యతిరేకంగా ఐటీ, ఈడీ నమోదు చేసిన కేసులు రాజకీయ ప్రేరేపితం. నేను బీజేపీ ప్రతీకార, కక్ష సాధి పు రాజకీయాల బాధితుడ్ని. నాకు దేవుడిపై, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. కక్ష సాధింపు చర్యలపై విజయం సాధించి బయటకు వస్తా’ అని ధీమా వ్యక్తం చేశారు. 

మరోవైపు తాజా అరెస్టులపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడ్డాయి విపక్షాలు.. శివకుమార్‌ ఏ ఆర్థిక నేరాలకు పాల్పడలేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి వీఎస్‌ ఉగ్రప్ప అన్నారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు శివకుమార్‌కు పూర్తిమద్దతు ప్రకటించారు, 

ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా స్పందిస్తూ.. ఆర్థిక ఎమర్జెన్సీ నుంచి దేశం దృష్టి మళ్లించేందుకే శివకుమార్‌ను కేంద్రం అరెస్ట్‌ చేయించిందన్నారు. జేడీఎస్‌ నేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి స్పందిస్తూ విపక్ష నేతలను అణగదొక్కేందుకు దర్యాప్తు సంస్థలను కేంద్రం వాడుకుంటున్నదన్నారు. 

పన్ను ఎగవేత, కోట్లాది రూపాయల హవాలా లావాదేవీలపై ఐటీ శాఖ గతేడాది బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో శివకుమార్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని శివకుమార్‌ ఇంట్లో రూ.8 కోట్ల నగదు దొరికింది.. ఈ కేసు వెనుక రాజకీయాలు లేవని బీజేపీ మండిపడింది. ఇప్పటికే మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయి సీబీఐ కస్టడీలో వున్న సంగతి తెలిపింది. వరుసగా కాంగ్రెస్ నేతల అరెస్టులు క్యాడర్లో నిరుత్సాహం నింపుతున్నాయి. 

మరోవైపు ఈడీ అదుపులో వున్న శివకుమార్ అనారోగ్యం పాలయ్యారు, బీపీ లెవల్స్ పెరగడంతో ఆయనను మంగళవారం రాత్రి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle