newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాంగ్రెస్ కొంత ఊపిరి పీల్చుకోవ‌చ్చు..!

24-10-201924-10-2019 14:58:39 IST
Updated On 24-10-2019 16:32:00 ISTUpdated On 24-10-20192019-10-24T09:28:39.781Z24-10-2019 2019-10-24T09:28:35.609Z - 2019-10-24T11:02:00.060Z - 24-10-2019

కాంగ్రెస్ కొంత ఊపిరి పీల్చుకోవ‌చ్చు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐదు నెల‌ల క్రితం జ‌రిగిన పార్లమెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించింది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుతో ఆ పార్టీకి ప్ర‌జ‌ల్లో మ‌రింత ఇమేజ్ పెరిగింది. కేంద్రంలో అధికారంలో ఉండ‌టం బలాన్నిచ్చింది. ఎన్నిక‌ల ముందే ఇత‌ర పార్టీల నుంచి నేత‌లు క్యూ క‌ట్టి వ‌చ్చి చేరారు.

క‌చ్చితంగా బీజేపీ గెల‌వ‌బోతోంద‌నే భావ‌న ఎన్నిక‌ల ముందే ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డింది. న‌రేంద్ర మోడీ, అమిత్ షా వంటి బ‌ల‌మైన నేత‌లు ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ఇంత చేసినా బీజేపీకి ఆశించిన స్థాయిలో ఫ‌లితాలు రాలేదు.

మ‌హారాష్ట్ర‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చినా హ‌ర్యానాలో మాత్రం ఆ పార్టీకి ఎదురు దెబ్బ త‌గిలింది. అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించినా మేజిక్ ఫిగ‌ర్‌ను అందుకోలేక పోయింది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జ‌న‌నాయ‌క్ జ‌న‌తా పార్టీని, స్వ‌తంత్రుల‌ను బ‌తిమాలుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ ఊహించ‌ని విధంగా సీట్లు సాధించి బీజేపీని అధికారంలోకి రాకుండా చూసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

మ‌హారాష్ట్ర‌లో కోలుకోద‌నుకున్న కాంగ్రెస్ పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో సాధించిన సీట్ల కంటే ఎక్కువ సీట్ల‌ను గెలుచుకుంది. ఎంఐఎం, వంచిత్ బ‌హుజ‌న్ అఘాడీ పార్టీలు త‌మ ఓట్ల‌నే చీల్చినా, ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ కాంగ్రెస్ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన సంఖ్య‌ను నిల‌బెట్టుకోగ‌లిగింది. ఇక‌, హ‌ర్యానాలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా గ‌త ఎన్నిక‌ల్లో సాధించిన సీట్ల కంటే 15 సీట్లు పెంచుకుంది. మొత్తంగా 30కి పైగా సీట్ల‌ను గెలుచుకుంది.

కాంగ్రెస్ దూకుడుతో బీజేపీ అధికార పీఠాన్ని అందుకోలేక‌పోయింది. ఇక వివిధ రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్‌కు మెరుగ్గానే ఫ‌లితాలు వ‌చ్చాయి. పంజాబ్‌లోని నాలుగు స్థానాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో మూడు స్థానాల‌ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కేర‌ళ‌లో ఐదు స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా రెండింటిని కాంగ్రెస్ గెలుచుకుంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ఒక ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ గెలిచింది.

బీజేపీ అధికారంలో ఉన్న గుజ‌రాత్‌లో ఆరు అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా మూడింటిని కాంగ్రెస్ ద‌క్కించుకుంది. ఇది ఆ రాష్ట్రంలో బీజేపీకి షాక్ ఇచ్చిన‌ట్లే. చ‌త్తీస్‌ఘ‌డ్‌, పుదుచ్చెరిలో జ‌రిగిన రెండు స్థానాల‌నూ కాంగ్రెస్ ద‌క్కించుకుంది. ఇలా మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు వివిధ రాష్ట్రాల ఉప ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ ఊహించిన దాని కంటే మంచి ఫ‌లితాల‌ను సాధించింది.

జాతీయ స్థాయిలో నాయ‌క‌త్వ లోపం. బావి నాయ‌కుడే త‌న వ‌ల్ల కాదు అని చేతులెత్తేసిన ప‌రిస్థితి. స్వంత నేత‌ల‌కే న‌మ్మ‌కం లేక పార్టీని వీడిన స‌మ‌యం. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసిన దాఖ‌లాలు లేవు. క‌నీసం ఎన్నిక‌ల వ్యూహాలు ర‌చించే వారు కూడా లేదు. ఇన్ని ర‌కాలుగా పార్టీలోనే లోపాలు ఉన్నా, ప్ర‌త్య‌ర్థులు బ‌లంగా ఉన్నా ఇవాళ వ‌చ్చిన ఫ‌లితాలు కాంగ్రెస్‌కు కొంత ఊర‌ట‌నిచ్చాయ‌నే చెప్పాలి.

ఇవాళ‌ ఫ‌లితాల‌ను స‌మ‌గ్రంగా విశ్లేషించుకుంటే బ‌ల‌మైన నాయ‌క‌త్వం, స‌రైన వ్యూహ‌ర‌చ‌న ఉంటే క‌చ్చితంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ దూకుడుకు క‌ళ్లెం వేయ‌గ‌లిగిన శ‌క్తి కాంగ్రెస్ పార్టీకి మాత్ర‌మే ఉన్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రి, ఈ విష‌యాన్ని గ్ర‌హించాల్సింది కాంగ్రెస్ పార్టీనే.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle