కాంగ్రెస్ కు ఈ సారి కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా లేనట్లే
27-05-201927-05-2019 15:31:13 IST
Updated On 26-06-2019 15:13:51 ISTUpdated On 26-06-20192019-05-27T10:01:13.509Z27-05-2019 2019-05-27T10:00:52.802Z - 2019-06-26T09:43:51.127Z - 26-06-2019

ఈ ఎన్నికల్లో దారుణ పరాభవం మూటకట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. గత ఎన్నికల ఫలితాలతో లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ, ఈ ఎన్నికల్లో అయినా పరువు దక్కించుకోవాలని ప్రయత్నించి విఫలం అయింది. 2014లో కాంగ్రెస్ పార్టీ కేవలం 44 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది.
ఈ ఎన్నికల్లో 52 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 55 మంది సభ్యులు ఉండాలి. అంటే మొత్తం సీట్లలో పదిశాతం అన్నమాట. అయితే ఈసారి ప్రధాన ప్రతిపక్ష హోదాకు కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు తక్కువ అయ్యాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత పలు అంశాల్లో కీలకంగా వ్యవహరిస్తారు. రాజ్యాంగ బద్ధమైన నియామకాల్లో ప్రతిపక్ష నేత మాట కూడా చెల్లుబాటు అవుతుంది. ఆయన అభ్యంతరాన్ని ప్రభుత్వం కచ్చితంగా చర్చించి తీరాలి.
ముఖ్యంగా లోక్పాల్, సీబీఐ డైరెక్టర్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఛైర్పర్సన్ నియామకాలకు ప్రతిపక్ష నేత అభిప్రాయాన్ని తప్పని సరిగా తీసుకోవాలి. అయితే 2014లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. లోక్పాల్ నియామక సమావేశానికి మల్లిఖార్జున ఖర్గేను ప్రత్యేక అతిధిగా ఆహ్వానించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఆ సమావేశానికి వెళ్లలేదు.
దీంతో లోక్పాల్ నియామకం నిలిచిపోయింది. 2014 ఎన్నికల దాకా తమకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించని కాంగ్రెస్ పార్టీ, గతంలో ఓ డిమాండ్ తెర మీదకు తెచ్చింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మొత్తం సీట్లలో పది శాతం సభ్యులు ఉండాలన్న నియమాన్ని మార్చాలని పట్టుపట్టింది. అంతేకాదు, తమ డిమాండుకు అనుకూలంగా చట్ట సరవణ చేయాలనీ వాదించింది. కానీ అప్పట్లో మోడీ ప్రభుత్వం ఆ వాదనను తోసిపుచ్చింది.
ఇప్పుడు కూడా అదే పరిస్థితి రావడంతో కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే స్వతంత్రంగా గెలిచిన వారిని తమ పార్టీలో చేర్చుకుంటే, సంఖ్యా బలం పెరిగి ప్రతిపక్ష హోదా దక్కుతుందన్న వాదన కూడా ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోందట. అయితే ఈ వాదనకు ఏ మేరకు చట్టబద్ధత ఉందో తేలాలి.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
11 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
12 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా