కాంగ్రెస్ ఎంపీల ప్రతాపం. ఐదేళ్ళపాటు వేటుపై స్పీకర్ ఆలోచన
26-11-201926-11-2019 09:24:38 IST
2019-11-26T03:54:38.045Z26-11-2019 2019-11-26T03:54:30.340Z - - 15-04-2021

మహారాష్ట్రలో పరిణామాలపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున నిరసనకు దిగుతోంది. సోమవారం పార్లమెంటును స్తంభింపచేశారు ఆపార్టీ ఎంపీలు. లోక్‌సభలో కాంగ్రెస్ తీవ్ర నిరసన పై ఆగ్రహించిన స్పీకర్ ఓం బిర్లా ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలను సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసిందే. హిబి ఈడెన్, టీఎన్ ప్రతాపన్ లోక్‌సభ కార్యకలాపాలకు అడ్డుతగులుతూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో స్పీకర్ మండిపడ్డారు. సభాపతి ఎంతగా నచ్చజెప్పినా ఇద్దరు ఎంపీలు వినలేదు. పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శించారు. ''ప్రజాస్వామ్య హత్యను అడ్డుకోండి' అని నినదిస్తూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యానర్‌తో నిరసన తెలిపారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. మార్షల్స్ వచ్చి కాంగ్రెస్ ఎంపీలను నిలువరించే ప్రయత్నం చేశారు. మార్షల్స్‌తో ఎంపీలు గొడవకు దిగారు. పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఆ ఇద్దరు ఎంపీలూ క్షమాపణలు చెప్పాలని స్పీకర్ ఆదేశించారు. కానీ ఎంపీలు క్షమాపణ చెప్పలేదు. దీంతో సభాపతి ఓం బిర్లా వారిని సస్పెండ్ చేశారు. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీల తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మార్ష ల్స్‌ను నెట్టివేసిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు హిబి ఈడెన్, టీఎం ప్రతాపంలపై ఐదేండ్లు సస్పెన్షన్ వేటు వేసే అంశాన్ని స్పీకర్ ఓం బిర్లా పరిశీలిస్తున్నారు. 17వ లోక్‌సభ వారం క్రితమే ప్రారంభమయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ మొదటిసారి సభ సోమవారం వాయిదా పడింది. మార్షల్స్‌పై చేయి చేసుకున్న సభ్యులపై ఆగ్రహంతో ఉన్న స్పీకర్.. వారిపై కఠిన చర్య తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్లమెంట్ వద్ద రేపు ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు పార్లమెంట్ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎంపీలు నిరసన తెలపనున్నారు.

నా రూటే సెపరేటు
44 minutes ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
14 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
15 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
15 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
19 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
20 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
18 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
20 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
21 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
16 hours ago
ఇంకా