newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

కాంగ్రెస్ ఇక గ‌త‌మే..!

26-07-201926-07-2019 08:41:51 IST
Updated On 26-07-2019 12:19:30 ISTUpdated On 26-07-20192019-07-26T03:11:51.825Z26-07-2019 2019-07-26T03:11:48.581Z - 2019-07-26T06:49:30.069Z - 26-07-2019

కాంగ్రెస్ ఇక గ‌త‌మే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఐదు ద‌శాబ్దాల పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మ‌నుగ‌డ ఇప్పుడు ప్ర‌శ్నార్థకంగా మారింది. హేమాహేమీల్లాంటి నేత‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏక‌ఛ‌త్రాధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన ఆ పార్టీ ఇప్పుడు ఉనికి కోల్పోతోంది. అస‌లు ఆ పార్టీ ఉందా, లేదా అనేలా మారిపోయింది. ప‌రిస్థితి చూస్తుంటే ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ గ‌త‌మే అన్న‌ట్లుగా ప‌రిస్థితి ఉంది.

2009 వ‌ర‌కు కాంగ్రెస్‌కు రాష్ట్రంలో తిరుగులేద‌నేలా ప‌రిస్థితి ఉండేది. టీడీపీ ఆవిర్భావం త‌ర్వాత ఓట‌ములు ఎదురైనా ఆ పార్టీకి క్యాడ‌ర్, లీడ‌ర్లు మాత్రం చెక్కుచెద‌ర‌లేదు. బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఆ పార్టీ సొంతం. 2004కి ముందు ఆ పార్టీకి కొంత క‌ష్ట‌కాల‌మే ఉన్నా వైఎస్సార్ త‌న క‌ష్టంతో పార్టీని వ‌రుస‌గా రెండుసార్లు గెలిపించారు. ఆయ‌న మ‌ర‌ణంతో కాంగ్రెస్ పార్టీకి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ముఖ్యంగా వైఎస్ కుటుంబాన్ని దూరం చేసుకోవ‌డంతోనే కాంగ్రెస్ పార్టీ ప‌త‌నం ప్రారంభ‌మైంది.

వైఎస్ జ‌గ‌న్ సొంత పార్టీ పెట్టుకొని కాంగ్రెస్‌ను పూర్తిగా దెబ్బతీశారు. కొంద‌రు లీడ‌ర్ల‌తో పాటు కాంగ్రెస్ ద‌శాబ్దాలుగా అండ‌గా ఉంటున్న ఓటుబ్యాంకును కూడా త‌న‌తో పాటు తీసుకెళ్లారు. ఇక‌, 2014లో రాష్ట్ర విభ‌జ‌న చేయ‌డం ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆ పార్టీ పూర్తిగా దెబ్బ‌తింది. అప్ప‌టికీ ఉన్న నేత‌ల్లో కొంద‌రు వైసీపీలోకి, మ‌రికొంద‌రు టీడీపీలోకి వెళ్లిపోయారు. ఏ పార్టీలోకి వెళ్లే అవ‌కాశం లేని వారు, కాంగ్రెస్ అంటే భ‌క్తి ఉన్న వారు మాత్రం పార్టీలోనే ఉన్నారు.

ఇక‌, 2019 ఎన్నిక‌లపై ఆ పార్టీ బాగానే ఆశ‌లు పెట్టుకుంది. పార్టీని వీడిన మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డిని మ‌ళ్లీ పార్టీలోకి తీసుకొచ్చారు. తెలుగుదేశంతో పొత్తు ఉంటుంద‌ని, ఈ పొత్తులో భాగంగా ఒక‌టి రెండు సీట్లు ద‌క్కించుకుంటామ‌ని అనుకున్నారు. కానీ, సీన్ రివ‌ర్స్ అయ్యింది. టీడీపీ పొత్తుకు దూరంగా ఉంది. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌నే హామీతో ఎన్నిక‌ల‌కు వెళ్లింది. కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇచ్చి మ‌ళ్లీ పార్టీకి కొంతైనా పున‌ర్వైభ‌వం తీసుకురావాల‌ని అనుకుంది.

అయితే, కాంగ్రెస్ ఆశ‌లు అడియాస‌ల‌య్యాయి. కేంద్రంలో కాంగ్రెస్ చిత్తుగా ఓడింది. రాష్ట్రంలో అయితే నోటా కంటే కాంగ్రెస్‌కు త‌క్కువ ఓట్లు వ‌చ్చాయి. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ భ‌విష్య‌త్తు ప్రశ్నార్థ‌క‌మైంది. కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతున్న నేత‌ల‌కు భ‌విష్య‌త్ అంధ‌కారంలా మారింది. ఏకంగా పీసీసీ అధ్య‌క్షుడిగా ఉంటూ ఇంత‌కాలంగా పార్టీని లాగుతున్న ర‌ఘువీరారెడ్డి కూడా చేతులెత్తేశారు.

ఆయ‌న పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసేశారు. ఆయ‌న రాజీనామాను ఆమోదించి, కొత్త వారిని ఈ ప‌ద‌విలో నియ‌మించే ప‌రిస్థితిలోనూ అధిష్ఠానం లేదు. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లోనూ చాలామంది నేత‌లు కాంగ్రెస్‌ను వీడి ఇత‌ర పార్టీల్లో చేరిపోయారు. ఇక‌, ఆ పార్టీలో అంతోఇంతో పేరున్న నేత‌లూ దూరంగా ఉంటున్నారు. కిర‌ణ్‌కుమార్ రెడ్డి పార్టీలో చేరినా క‌నీసం ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌లేదు. చిరంజీవి పార్టీ స‌భ్య‌త్వాన్ని కూడా పున‌రుద్ధ‌రించుకోకుండా పార్టీకి గుడ్‌బై చెప్పారు.

ఇలా, ఓవైపు ఓటుబ్యాంకు దూర‌మై, మ‌రోవైపు నేత‌లు దూర‌మై కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచ‌ని స్థితిలో ఉంది. ఇక‌, కాంగ్రెస్‌కు రాష్ట్రంలో స్థానం లేద‌ని భావిస్తున్న మిగిలి ఉన్న కొంద‌రు నేత‌లు బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీలో చేరి మ‌ళ్లీ రాజ‌కీయంగా 


Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle