newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిన క‌శ్మీర్ అంశం

07-08-201907-08-2019 15:14:52 IST
Updated On 07-08-2019 15:28:40 ISTUpdated On 07-08-20192019-08-07T09:44:52.169Z07-08-2019 2019-08-07T09:44:46.399Z - 2019-08-07T09:58:40.361Z - 07-08-2019

కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిన క‌శ్మీర్ అంశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏడు ద‌శాబ్దాలుగా పీడిస్తున్న జ‌మ్మూ క‌శ్మీర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాల‌పై దేశ‌వ్యాప్తంగా మోజారిటీ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, క‌శ్మీర్ విభ‌జ‌న‌పై బీజేపీ నిర్ణ‌యాల ప‌ట్ల అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. ఈ నిర్ణ‌యంతో న‌రేంద్ర మోడీ, బీజేపీ దేశంలో ఇంకా బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తిగా మారుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.

అయితే, ఈ వ్య‌వ‌హారంలో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ రెండు నిర్ణ‌యాల‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్రం తీరును త‌ప్పుబ‌ట్టింది. కేంద్రం చేసింది అప్ర‌జాస్వామిక‌మ‌ని ఆరోపించింది. గులాం న‌బీ ఆజాద్‌ను ముందుపెట్టి కేంద్రం నిర్ణ‌యాల‌ను విమ‌ర్శించింది. ఇలా కేంద్రాన్ని విమ‌ర్శించే స‌మ‌యంలో దేశ ప్ర‌జ‌ల మ‌నోభావాలు ఎలా ఉన్నాయో, కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాల‌పై దేశ ప్ర‌జ‌లు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోలేక‌పోయింది.

కేంద్రాన్ని త‌ప్పుప‌ట్టే దిశ‌లో లోక్‌స‌భ‌లో అయితే మ‌న దేశ విధానాన్నే ప్ర‌శ్నించింది. క‌శ్మీర్ అంశం త‌మ అంత‌ర్గ‌త‌మ‌ని, ఇందులో ఎవ‌రి ప్ర‌మేయం ఉండ‌వ‌ద్ద‌నేది మ‌న దేశ విధానం. అధికారంలో ఏ పార్టీ ఉన్నా మ‌న విధానం అయితే ఇదే. కానీ, నిన్న లోక్‌స‌భ‌లో కాంగ్రెస్ ప‌క్ష నేత అధీర్ రంజ‌న్ మాట్లాడుతూ.. క‌శ్మీర్ ద్వైపాక్షిక అంశ‌మ‌ని చెప్పి ప‌ప్పులో కాలేశారు.

ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజ‌కీయాలు చేస్తోంద‌ని, దేశ ప్ర‌యోజ‌నాల ఆ పార్టీకి ప‌ట్ట‌వ‌ని బీజేపీ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లి రెండు ఎన్నిక‌ల్లో చావు దెబ్బ కొట్టింది. అయినా కాంగ్రెస్ పార్టీ తేరుకున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. దేశ ప్ర‌జ‌ల్లో మెజారిటీ కేంద్ర నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తుంటే కాంగ్రెస్ వ్య‌తిరేకించ‌డం ద్వారా వారిలో ఆ పార్టీ ప‌ట్ల వ్య‌తిరేక‌త వ‌స్తోంది.

ఇక‌, ఏకంగా కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయులుగా ఉండే నేత‌లే పార్టీ విధానాన్ని త‌ప్పుబ‌డుతూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్థిస్తున్నారు. రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ చీఫ్ విప్‌గా ఉన్న‌భుబ‌నేశ్వ‌ర్ క‌లితా అయితే పార్టీకి, రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి సైతం రాజీనామా చేశారు. విప్ జారీ చేయాల‌నే పార్టీ ఆదేశాల‌ను దిక్క‌రించి కాంగ్రెస్‌వి దేశ వ్య‌తిరేక విధాన‌మ‌ని, అందులో భాగం కాద‌ల్చుకోలేద‌ని రాజీనామా చేశారు.

జ్యోతిరాధిత్య సింధియా, దీపేంద‌ర్ హుడా, జ‌నార్ధ‌న్ ద్వివేది, మిలింద్ దేవ‌రా వంటి కాంగ్రెస్ నేత‌లు సైతం పార్టీ వైఖ‌రిని విభేదించి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్థించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చాలామంది పార్టీ వైఖ‌రిని ప‌క్క‌న పెట్టి వ్య‌క్తిగ‌తంగా కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. ఇలా పార్టీ శ్రేణులు, నేత‌లు, ప్ర‌జ‌లు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోలేక క‌శ్మీర్‌పై కేంద్రం నిర్ణ‌యాల‌ను గుడ్డిగా వ్య‌తిరేకించిన కాంగ్రెస్ మ‌రింత వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకుంది. ఈ అంశంలో కొంత సంయ‌మ‌నంతో ఆ పార్టీ వ్య‌వ‌హ‌రిస్తే బాగుండేద‌ని ఆ పార్టీ నేత‌లే అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తానికి క‌శ్మీర్ విభ‌జ‌న అంశం కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది.  

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   21 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle