newssting
BITING NEWS :
*అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం *నా వల్ల.. వంశీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారంటూ టీడీపీ అడ్డగోలు కామెంట్లు - మంత్రి కొడాలి నాని *సీఎం జగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది..?-మంత్రి నాని *ఆర్టీసీ, రవాణాశాఖాదికారులతో సీఎం కేసీఆర్ భేటీ*శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ప్రమాదం లేదంటున్న డ్యామ్ సేఫ్టీ అధికారులు *తూ.గో: ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్*విజయవాడ: స్టెల్లా కాలేజీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత*2021 అసెంబ్లీ ఎన్నికలు అద్భుతాలు ఖాయం-రజనీకాంత్

కాంగ్రెస్‌పై కుమారస్వామి ఫైర్

03-05-201903-05-2019 08:33:06 IST
Updated On 02-07-2019 12:33:15 ISTUpdated On 02-07-20192019-05-03T03:03:06.531Z03-05-2019 2019-05-03T03:02:49.838Z - 2019-07-02T07:03:15.598Z - 02-07-2019

కాంగ్రెస్‌పై కుమారస్వామి ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవ‌స‌రార్ధం సంసారం చేస్తే అన్ని విష‌యాల్లో అనుమానాలే ఉంటాయి. ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో కూడా ఇదే జ‌రిగింద‌ట‌. ఎన్నిక‌ల ముందు వేరు వేరుగా పోటీ చేసిన జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు, ఫ‌లితాల త‌ర్వాత బీజేపీని అధికారంలోకి రాకుండా పొత్తు ప్ర‌భుత్వం ఏర్పాటు చేశాయి. కానీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన మొద‌టి నుంచీ రెండు పార్టీల మ‌ధ్య పొర‌పొచ్చాలు వ‌స్తూనే ఉన్నాయి. 

ఓ ద‌శ‌లో తాను సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకుని, ప్ర‌భుత్వాన్ని కూల్చేస్తాన‌న్న ధోర‌ణికి వెళ్లారు సీఎం కుమార‌స్వామి. ఎందుకంటే ప్ర‌తి విష‌యంలో కాంగ్రెస్ నేత‌లు పెడుతున్న మెలిక‌ల‌తో ఆయ‌న విసుగు చెందార‌ట‌. ఇప్పుడు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ట‌. మొత్తం 28 సీట్లలో జేడీఎస్ 7 చోట్ల‌, కాంగ్రెస్ పార్టీ 21 చోట్ల పోటీ చేస్తున్నాయి. 

అయితే దాదాపుగా స‌గానికిపైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు పార్టీల నేత‌ల మధ్య పొస‌గ‌డం లేద‌ట‌. ఒక‌రికి ఒక‌రు సాయం చేయ‌లేదు స‌రిక‌దా, ప‌రోక్షంగా చాలా చోట్ల బీజేపీకి సాయం చేశార‌ట‌. మొద‌టి నుంచీ బ‌ద్ద‌శ‌త్రువులైన దేవెగౌడ‌, సిద్ధ‌రామ‌య్య‌లు క‌ల్సి ప్ర‌చారం చేసినా, క్యాడ‌ర్ మాత్రం వారి మాట‌లు విన‌లేదు. క‌డుపులో కోపం పెట్టుకుని పైకి న‌వ్విన ఈ ఇద్ద‌రు నేత‌ల అంత‌రంగాన్ని ఎరిగిన కార్య‌క‌ర్త‌లు కూడా ఆ విధంగానే ప్ర‌వ‌ర్తించార‌ట‌. 

ప్ర‌ధానంగా తాము పోటీ చేసిన 7 సీట్ల‌లో త‌మ అభ్య‌ర్ధులు ఓడిపోవడానికి కాంగ్రెస్ కేడ‌ర్ ప‌నిచేసింద‌ని సీఎం కుమార‌స్వామి కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన‌ట్లు తెలుస్తోంది. మాండ్యాలో బీజేపీ మ‌ద్ద‌తుతో బ‌రిలో దిగిన సుమ‌ల‌త‌కు చాలా మంది కాంగ్రెస్ నేత‌లు బ‌హిరంగంగానే జెండాలు ప‌ట్టుకుని మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లు కుమార‌స్వామి వాపోతున్నారు. 

ఈ సీటులో కుమార‌స్వామి కుమారుడు నిఖిల్ గౌడ బ‌రిలో ఉన్నారు. అలాగే తుంకూరు నుంచి బ‌రిలో దిగిన దేవెగౌడ ప‌రిస్థితి కూడా ఇదే ర‌కంగా ఉంద‌ని కుమార‌స్వామి ఆరోపిస్తున్నారు. కేవ‌లం త‌న రెండో కుమారుడు ప్ర‌జ్వ‌ల్ పోటీ చేస్తున్న హ‌స‌న్ సీటులోనే ప‌రిస్థితి కొంచెం మెరుగ్గా ఉంద‌నేది ఆయ‌న అభిప్రాయం. 

ఒక‌వేళ మాండ్యా, తుంకూరు ఫ‌లితాలు వేరుగా వ‌స్తే, కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌కొట్టాలన్న దానిపై కుమార‌స్వామి వ్యూహం సిద్దం చేసిన‌ట్లు కూడా తెలుస్తోంది. అంటే మే 23వ తేదీ త‌ర్వాత క‌న్న‌డ రాజ‌కీయాల్లో అస‌లు అంకం మొద‌లు అవుతుంద‌ని అర్థం అవుతోంది. ఇప్పటికే ఎన్నికల అనంతరం కర్నాటకలో ప్రభుత్వం మారుతుందని మాజీ సీఎం, బీజేపీ నేత యడ్యూరప్ప జోస్యం చెప్పారు. అదిప్పుడు ఫలిస్తుందేమో. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle