newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

కాంగ్రెస్‌ను మింగేయ‌డ‌మే క‌మ‌ల‌నాధుల టార్గెట్‌..!

15-07-201915-07-2019 08:31:06 IST
Updated On 15-07-2019 08:26:29 ISTUpdated On 15-07-20192019-07-15T03:01:06.670Z15-07-2019 2019-07-15T02:55:44.867Z - 2019-07-15T02:56:29.504Z - 15-07-2019

కాంగ్రెస్‌ను మింగేయ‌డ‌మే క‌మ‌ల‌నాధుల టార్గెట్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఓడ‌లు బ‌ళ్లు.. బ‌ళ్లు ఓడ‌లు అవుతాయ‌నేది రాజ‌కీయాల్లో త‌ర‌చూ విన‌ప‌డే నానుడి. ఈ దేశాన్ని ఐదు ద‌శాబ్దాల పాటు పాలించిన 130 ఏళ్ల చ‌రిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అత్యంత క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది.

న‌రేంద్ర మోడీ - అమిత్ షా ద్వ‌యం ఆడుతున్న రాజ‌కీయ చ‌ద‌రంగంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ కుప్ప‌కూలిపోతోంది.దేశాన్ని కాషాయ‌మ‌యం చేయాల‌ని, అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం ద‌క్కించుకోవాల‌నేది మోడీ - షా టార్గెట్. గ‌తంలో బీజేపీని బ‌ల‌మైన శ‌క్తిగా మ‌లిచిన అట‌ల్ బిహారీ వాజ్‌పేయి - ఎల్‌కే అద్వానీ కూడా పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డానికి ఎంతో శ్ర‌మించారు.

అయితే, అప్పుడు త‌మ సిద్ధాంతాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి మాత్రమే బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, మోడీ - షా టార్గెట్ ఇప్పుడు వేరు. సిద్ధాంతాల‌తో సంబంధం లేకుండా పార్టీని బ‌లీయ‌మైన శ‌క్తిని చేయ‌డ‌మే బీజేపీ టార్గెట్.

పార్టీని అన్ని రాష్ట్రాల్లో బ‌లోపేతం చేసుకునేందుకు బీజేపీ ఎంచుకున్న ప్ర‌ధాన మార్గం ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను మింగేయ‌డం. ఒక్కో రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తూ ఆ రాష్ట్రంలో ఉన్న ప్ర‌ధాన పార్టీ నుంచి నేత‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకొని ఆ పార్టీని పూర్తిగా బ‌ల‌హీనం చేయ‌డం.

ఈ వ్యూహాన్ని ఇప్ప‌టికే వివిధ రాష్ట్రాల్లో స‌మ‌ర్థంగా అమ‌లు చేస్తోంది బీజేపీ. ఇందుకు ఈశాన్య రాష్ట్రాలే ఉదాహ‌ర‌ణ‌. ఒక‌ప్పుడు క‌నీస ఓట్లు కూడా ఇక్క‌డ ద‌క్కించుకోలేని ఆ పార్టీ ఇప్పుడు ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేస్తోంది. ఇక్క‌డ ఇత‌ర పార్టీల నుంచి నేత‌ల‌ను చేర్చుకోవ‌డం ద్వారా బీజేపీ బ‌ల‌ప‌డంది.

ముఖ్యంగా కాంగ్రెస్ ముక్త భార‌త్ చేయాల‌నే టార్గెట్ దిశ‌గా మోడీ - షా ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా, గోవానే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఓవైపు క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ - జేడీఎస్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌య‌త్నిస్తూనే కాంగ్రెస్‌కు గోవాలో ఊహించ‌ని షాక్ ఇచ్చింది బీజేపీ.

గోవాలో అతిపెద్ద పార్టీగా నిలిచినా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌లేక‌పోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పెద్ద షాక్ ఇచ్చింది బీజేపీ. 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మందిని పార్టీలో చేర్చేసుకొని శాన‌స‌స‌భా ప‌క్షాన్ని విలీనం చేసేసుకుంది. ఏకంగా ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చేసింది.

అంత‌కుముందు 2016లో ఉత్త‌రాఖండ్‌లో, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో, 2017లో మ‌ణిపూర్‌లో, త్రిపురాలో, 2018లో గోవాలో, ఈ సంవ‌త్స‌రం త్రిపుర‌, గుజ‌రాత్‌లోనూ కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల‌ను బీజేపీ చేర్చేసుకుంది.

ఈ రాష్ట్రాల్లో ఇక కాంగ్రెస్ కోలుకునే ప‌రిస్థితులు కూడా క‌నిపించ‌డం లేదు. తాజాగా గోవా, క‌ర్ణాట‌క‌లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వం బ‌లంగా ఉండ‌టం, దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు బీజేపీ వైపే ఉండ‌టంతో కాంగ్రెస్ నేత‌లు సైతం అటువైపే మొగ్గు చూపుతున్నారు.

ఇలా కాంగ్రెస్ పార్టీని ఒక్కో రాష్ట్రంలో మింగేసుకుంటూ వెళుతోంది బీజేపీ. అన్ని రాష్ట్రాల్లో సీక్రెట్ ఆప‌రేష‌న్లు చేస్తూ కాంగ్రెస్ కు షాకులు ఇస్తోంది. బీజేపీ దాటికి కాంగ్రెస్ ఎదురునిల‌వ‌లేక‌పోతోంది.

Image result for GOa Mlas joins

క‌నీసం, ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి చేర్చుకుంటున్న‌ప్పుడు బీజేపీ వైఖ‌రిని గ‌ట్టిగా ప్ర‌శ్నించ‌డంలోనూ కాంగ్రెస్ విఫ‌ల‌మైంది. ప‌రిస్థితి ఇలానే కొన‌సాగితే మోడీ - షా త్వ‌ర‌లోనే కాంగ్రెస్ ముక్త్ భార‌త్‌ను చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle