కాంగ్రెస్కు ‘మహా’ ఎన్నికల పరీక్ష
28-09-201928-09-2019 12:39:51 IST
Updated On 28-09-2019 16:56:20 ISTUpdated On 28-09-20192019-09-28T07:09:51.917Z28-09-2019 2019-09-28T07:09:49.204Z - 2019-09-28T11:26:20.307Z - 28-09-2019

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాస్ట్రాలలో జరగనున్న ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్షే అని చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుండగా, కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎన్నికల సమరాన్ని ఎదుర్కొనే విషయంలో ఇంకా సన్నద్ధత కనిపించడం లేదు. రాహుల్ గాందీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తరువాత తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు చేప్టటిన తరువాత జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ సారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక వధేరా గాంధీ కూడా చురుకుగా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అయితే వచ్చిన సమస్యల్లా సోనియా, ప్రియాంకల ప్రచారం మహారాష్ట్ర, హర్యానాలలో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నదే. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలలో శివసేన, బీజేపీ పొత్తు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగడం కాంగ్రెస్ కు ఎదురు దెబ్బేనని చెప్పాలి. పోత్తు విషయంలో బీజేపీ, శివసేనల మధ్యా తగాదా గురించి వచ్చిన వార్తలన్నీ వదంతులేనని తేలిపోయింది. ముందు నుంచీ అనుకున్నట్లుగానే సగానికి పైగా స్థానాలను శివసేనకు వదిలేయడానికి బీజేపీ అంగీకరించడంతో ఆ కూటమి బలీయంగా మారింది. మరో వైపు షెడ్యూల్ విడుదలై ఇన్నిరోజులు గడుస్తున్నా..కాంగ్రెస్ ఎన్సీపీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అదే సమయంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతోంది. కాంగ్రెస్ లో ఈ నిస్తేజానికి కారణం గత సార్వత్రిక ఎన్నికల ఓటమి తరువాత ఆ పార్టీ తేరుకోలేకపోవడమే. పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడమే ఆ పార్టీలోని నైరాశ్యానికీ, నిరుత్సాహానికీ తార్కానంగా చెప్పుకోవచ్చు. సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టినా పార్టీకి మునుపటి జవసత్వాలు వచ్చినట్లు కనబడదు. వరుసగా రెండు సార్లు సార్వత్రిక ఎన్నికలలో ఓటమి తరువాత ఆ పార్టీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. రాష్ట్రాలలో పార్టీ అధిష్టానం పట్టు కోల్పోయినట్లుగా తోస్తున్నది. ఈ ప్రభావమంతా ఇప్పుడు జరగనున్న హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కనిపిస్తున్నది. రెండు రాష్ట్రాలలోనూ కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో గెలుపు ధీమా కనిపించడం లేదు. రెండు రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్న బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ...ఆర్టికల్ 370 రద్దు ద్వారా ప్రజలలో సానుకూలత సాధించగలిగామన్న ధీమాలో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి. అదే సమయంలో ఆర్థిక మాంద్యం ప్రభావం అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై ఇసుమంతైనా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇందుకు కారణం కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో జనబాహుల్యంలో ఆ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఆ కారణంగానే బీజేపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతుంటే...కాంగ్రెస్ శ్రేణులు మీమాంసలతో డీలా పడ్డాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తు ఖరారైనట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో శరద్ పవార్ పై మనీలాండరింగ్ కేసులో ఈడీ దూకుడు కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి ఏ మేరకు సానుభూతి తెచ్చిపెడుతుందన్నది ప్రశ్నార్థకం. అయితే కాంగ్రెస్ పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుపైనే ఆధారపడినట్లుగా కనిపిస్తున్నది. ఉల్లి ధరల ఘాటు, శరద్ పవార్ పై కక్ష సాధింపు ధోరణి వంటి అంశాలే కాంగ్రెస్ తన ప్రధాన ప్రచారాస్త్రాలుగా భావిస్తుండగా, అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట ఇనుమడించేలా మోడీ దౌత్య విజయాలు, దాయాది దేశాన్ని ఏకాకిని చేసేలే ఐరాసా వేదికపై మోడీ ప్రసంగం ఇవన్నీ బీజేపీకి కలిసొచ్చేలా ఉన్నాయన్నది పరిశీలకుల అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ‘మహా’పరీక్షను ఎలా ఎదుర్కొంటుందో, హర్యానాలో ఏ మేరకు పట్టు సాధిస్తుందో చూడాల్సిందే,

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
10 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
13 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
13 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
14 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
11 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
a day ago

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా