newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాంగ్రెస్‌కు పిడుగుపాటు.. పార్టీకి సింధియా రాజీనామా

10-03-202010-03-2020 13:31:39 IST
Updated On 10-03-2020 16:44:56 ISTUpdated On 10-03-20202020-03-10T08:01:39.831Z10-03-2020 2020-03-10T08:01:08.468Z - 2020-03-10T11:14:56.554Z - 10-03-2020

కాంగ్రెస్‌కు పిడుగుపాటు.. పార్టీకి సింధియా రాజీనామా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అనుకున్నదే జరిగిపోయింది. మధ్యప్రదేశ్ రాజకీయాలకు షాక్. అంతకుమించి కాంగ్రెస్ పార్టీకి పిడుగుపాటు.. కాంగ్రెస్‌కు నమ్మినబంటులా మధ్యప్రదేశ్ రాజకీయాలను శాసించిన సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా చేశారు. దీంతో మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. తన రాజీనామా లేఖను సింధియా పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో ఉన్న విభేధాల కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

మంగళవారం వేగంగా జరిగిపోయిన పరిణామాల మధ్య మొదట హోంమంత్రి అమిత్‌ షాతో కలిసి తర్వాత నరేంద్రమోదీతో భేటీ అయిన సింధియా.. కొద్దిసేపటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. తనతో పాటు మరో 17మంది ఎమ్మెల్యేలను బయటకు తీసుకువచ్చారు. వారందరినీ బెంగళూరులోని ఓ రిసార్టుకు తరలించారు. సింధియా రాజీనామాతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. మరోవైపు సింధియా బీజేపీలో చేరబోతున్నట్లు పుకార్లు వస్తున్నాయి. బీజేపీ తరపున రాజ్యసభకు ఎన్నికై కేంద్ర కేబినెట్‌లోకి వెళ్తారని సమాచారం. 

ఇక మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. మరోసారి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కే మధ్యప్రదేశ్‌ పగ్గాలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశానని సింధియా పేర్కొన్నారు. 18 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశానని.. ఏడాది కాలంగా కాంగ్రెస్‌ను వీడాలని ఆలోచిస్తున్నానని చెప్పారు.  రాష్ట్రానికి, దేశానికి సేవలందించాలన్నదే మొదట్నించీ తన కోరక అని, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పని చేయలేకపోతున్నాయని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలు,  కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలంటే మరోసారి కొత్తగా తమ పయనం ప్రారంభించాలని నిశ్చయించుకున్నానని చెప్పారు. ఇంతవరకూ తనకు సహకరించిన పార్టీ సహచరులు, కార్యకర్తలకు ధన్యవాదాలని సోనియాగాంధీకి పంపిన లేఖలో సింధియా పేర్కొన్నారు.

జ్యోతిరాదిత్య సింధియా.. ఈ ఒక్క పేరే ప్రస్తుతం కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు రుచి చూపించడంలో తీవ్రంగా కృషి చేసిన సింధియా.. ఇప్పుడు అదే ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేయడంలోనూ​ కీలకపాత్ర పోషించారు. కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగు బావుటా ఎగరేసిన 17 మంది ఎమ్మెల్యేలకు క్యాంపు నిర్వహిస్తూ.. కాంగ్రెస్‌ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. 

సింధియా రాజీనామాతోపాటు ఆయన్ని అనుసరించి పార్టీనుంచి బయటకు వచ్చిన 17 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోవడానికి సిద్దంగా ఉందని సంకేతాలు వెలువడుతున్నాయి.

సింధియా కుటుంబం దశాబ్దాలుగా మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా మొదట జన్‌ సంఘ్‌ నుంచి పోటీ చేసినప్పటికీ తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మారారు. కాగా అదే కుటుంబానికి చెందిన బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు విజయ రాజే సింధియా, ఆమె కుమార్తెలు వసుంధరా రాజే(రాజస్తాన్‌ మాజీ సీఎం), యశోదర రాజే(మధ్యప్రదేశ్‌ ఎంపీ) బీజేపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ సింధియాలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు పోటీకి నిలబడలేదు.  

గ్వాలియర్‌ సంస్థానాధీశుల వారసుడు జ్యోతిరాదిత్య సింధియా. ఆయన నానమ్మ రాజమాత విజయరాజే సింధియా జనసంఘ్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1971 ఎన్నికల్లో జనసంఘ్‌ తరఫున విజయరాజేతోపాటు మాధవ్‌రావు సింధియా కూడా పోటీ చేసి, గెలుపొందారు. అప్పట్లో ఇందిర ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన అతికొద్ది మందిలో వీరు కూడా ఉన్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విజయరాజేను కూడా ప్రభుత్వం జైలుపాలు చేసింది. అయితే, మాధవ్‌రావు సింధియా 1980లో కాంగ్రెస్‌ పార్టీలో చేరగా ఆయన తోబుట్టువులు వసుంధరా రాజే, యశోధరా రాజే బీజేపీలో చేరారు.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   3 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   4 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   4 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   8 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   9 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   7 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   10 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   5 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle