newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కస్టమర్లకు మరిన్ని సేవలు.. కేంద్రఆర్థికమంత్రి కీలక సంస్కరణలు

11-09-202011-09-2020 08:18:23 IST
Updated On 11-09-2020 09:59:40 ISTUpdated On 11-09-20202020-09-11T02:48:23.768Z11-09-2020 2020-09-11T02:47:30.086Z - 2020-09-11T04:29:40.575Z - 11-09-2020

కస్టమర్లకు మరిన్ని సేవలు.. కేంద్రఆర్థికమంత్రి కీలక సంస్కరణలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక వైపు కరోనా వైరస్ ఇబ్బందులు పెడుతోంది. దేశంలో పన్నుల రాబడి, జీఎస్టీ తగ్గిపోయింది. ఆర్థిక వ్యవస్థ గాడితప్పుతోంది. జీడీపీ తగ్గిపోయింది.  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థికవ్యవస్థను ఒక పద్దతిలోకి తీసుకుని రావడానికి, బ్యాంకింగ్ వ్యవస్థలో సంస్కరణలకు నాంది పలుకుతున్నారు. మారటోరియం విషయంలో కేంద్రం త్వరలో ఒక విధానం ప్రకటించనుంది. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంటివద్దకే బ్యాంకింగ్ సేవలు తెస్తామని ప్రకటించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇది వర్తిస్తుంది. ఈ కొత్త సర్వీసులతో బ్యాంక్ కస్టమర్లు ఇంటి నుంచే బ్యాంకింగ్ సర్వీసులు పొందే వీలుంది. కరోనా వైరస్ సమయంలో ఈ సర్వీసుల వల్ల ఖాతాదారులకు ఊరట కలుగనుంది. బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేదు. ఎంచక్కా ఇంటిలోనే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సేవలు అందుకునే అవకాశం కలుగుతుంది. 

ఎన్‌హ్యాన్స్‌డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ రిఫార్మ్స్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ సేవలు అందుబాటులోకి తీసుకువస్తోంది. అక్టోబర్ 1 నుంచి పీఎస్‌బీ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా అనేక సేవలు అందుతాయి.  ప్రస్తుతం ఇప్పుడు కూడా ఇంటి వద్దకే బ్యాంక్ సేవలకు అవకాశం వున్నా అది నాన్ ఫైనాన్షియల్ సర్వీసులకు మాత్రమే వర్తిస్తోంది. 

అక్టోబర్ 1 నుంచి ఫైనాన్షియల్ సర్వీసులు కూడా ఇంటి వ్దదనే పొందొచ్చు. నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కింద డిమాండ్ డ్రాఫ్ట్ పికప్, పే ఆర్డర్స్ పికప్, ఫామ్ 15హెచ్/15జీ పికప్, జీఎస్‌టీ చాలన్ పికప్, అకౌంట్ స్టేట్‌మెంట్ డెలివరీ, టర్మ్ డిపాజిట్ రశీదు ఇవ్వడం వంటి పలు రకాల సేవలను ఇంటి వద్దనే పొందవచ్చు. దీని వల్ల కస్టమర్లకు సమయం,డబ్బు ఆదా అవుతుంది. కరోనా రిస్క్ కూడా తగ్గుతుంది. 

ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన కస్టమర్లు తక్కువ ఫీజు చెల్లించి ఇంటి వద్దనే ఫైనాన్షియల్ సర్వీసులు పొందొచ్చు. సీనియర్ సిటిజన్స్, వికలాంగులు కూడా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు పొందే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన కస్టమర్లు ఇంటి వద్దనే సౌకర్యవంతంగా బ్యాంకింగ్ సేవలు పొందాలనేది ఈ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసుల అధిక లక్ష్యమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాల్ సెంటర్, వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా బ్యాంక్ కస్టమర్లు డోర్‌స్టెప్ సర్వీసులు పొందొచ్చు. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ఏజెంట్లు ఖాతాదారులకు వారు కోరిన సర్వీసులను అందిస్తారు. రాబోయే రోజుల్లో బ్యాంకులపై భారం మరింతగా తగ్గనుంది. వివిధ శాఖల వద్ద క్యూలు కనిపించవు. 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle