newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కళింగలో కమలానికి మంచి రోజులు

03-05-201903-05-2019 12:04:05 IST
Updated On 02-07-2019 12:28:57 ISTUpdated On 02-07-20192019-05-03T06:34:05.706Z03-05-2019 2019-05-03T06:34:01.771Z - 2019-07-02T06:58:57.389Z - 02-07-2019

కళింగలో కమలానికి మంచి రోజులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒడిశాలో బీజేపీకి కొంచెం తీపి, కొంచెం చేదు అనుభ‌వం రానుంద‌ట‌. పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు ఒడిశా అసెంబ్లీకి కూడా ఒకేసారి ఎన్నిక‌లు జ‌రిగాయి. గ‌త 19 సంవ‌త్సరాలుగా ఒడిశాకు సీఎంగా ఉన్న న‌వీన్ ప‌ట్నాయ‌క్ మీద జ‌నానికి న‌మ్మకం స‌డ‌ల‌లేద‌ట‌. అందుకే ఈసారి కూడా సీఎంగా ఆయ‌న‌నే కొన‌సాగిస్తార‌ని ఒడిశా మీడియా క‌థ‌నాలు రాస్తోంది. 

ఇక కాంగ్రెస్ పార్టీని మూడో స్థానానికి వెళ్లిపోయింద‌ని అర్థం చేసుకున్న న‌వీన్ ప‌ట్నాయ‌క్, బీజేపీ ఒక్కటే త‌న‌కు పోటీ అంటూ ఎన్నిక‌ల్లో ప్రచారం చేశారు. అంటే ఓ ర‌కంగా బీజేపీని చూసి ఆయ‌న కొంచెం బెదిరిన‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే, జ‌నం కూడా భారీగా క్రాస్ ఓటింగ్ వేశార‌ట‌. అసెంబ్లీకి బిజూ జ‌న‌తాద‌ళ్ పార్టీకి ఓటేసిన జ‌నం, పార్లమెంట్ సీటు విష‌యంలో మాత్రం భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఓటేసిన‌ట్లు తెలుస్తోంది. 

అదేమని అడిగిన ఓ స‌ర్వే సంస్థకు ఒడిశా ముఖ్యమంత్రిగా న‌వీన్ ప‌ట్నాయ‌క్, ప్రధాన మంత్రిగా న‌రేంద్ర మోడీ ఉండాల‌ని కోరుకుంటున్నట్లు చాలా మంది చెప్పార‌ట‌. అంటే ఒడిశాను చేజిక్కించుకోవాల‌ని ఆశ‌గా ఉన్న బీజేపీకి ఈసారి కూడా భంగ‌పాటు త‌ప్పేలా లేదు. కానీ లోక్ స‌భ సీట్లు మాత్రం పెర‌గ‌డం ఖాయ‌మ‌ని అర్థం అవుతోంది. 2014లో ఒడిశాలో ఉన్న మొత్తం 21 లోక్ స‌భ సీట్లలో 20 సీట్లలో బీజేడీ గెలిస్తే, బీజేపీ కేవ‌లం ఒక సీటులోనే విజయం సాధించింది. అంటే తాజా ప‌రిస్ఠితుల‌ను చూస్తే బీజేపీకి ఈసారి బాగానే క‌ల్సొచ్చిన‌ట్లు అర్థం అవుతోంది.

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   14 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   18 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   15 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   a day ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   a day ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle