newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కలవరపెడుతున్న కరోనా కేసులు... లాక్ ‌డౌన్ త‌ప్ప మార్గం లేదా..?

14-06-202014-06-2020 08:50:19 IST
Updated On 14-06-2020 10:25:35 ISTUpdated On 14-06-20202020-06-14T03:20:19.785Z14-06-2020 2020-06-14T03:20:16.079Z - 2020-06-14T04:55:35.335Z - 14-06-2020

కలవరపెడుతున్న కరోనా కేసులు... లాక్ ‌డౌన్ త‌ప్ప మార్గం లేదా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. ఇప్ప‌టికే మూడు ల‌క్షల కేసులు దాట‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల లిస్టులో భార‌త్ నాలుగో స్థానానికి చేరింది. అమెరికా, బ్రెజిల్‌, రెష్యా త‌ర్వాత భార‌త్ క‌రోనా కేసుల సంఖ్య‌లో నాలుగో స్థానంలో నిలిచింది. దేశంలో 2 ల‌క్ష‌ల నుంచి 3 ల‌క్ష‌ల కేసులు చేర‌డానికి కేవ‌లం 10 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ప‌ట్టింది. ప్ర‌తీ రోజూ సుమారు 10 వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో దేశంలో ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు ఉన్నాయ‌నే విశ్లేష‌ణ‌లు విన‌బ‌డుతున్నాయి.

క‌రోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో మ‌రోసారి దేశంలో లాక్‌డౌన్ విధించబోతున్నారు అనే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఈ నెల 15 నుంచి, 21 నుంచి దేశంలో మ‌రోసారి లాక్‌డౌన్ విధిస్తున్నారు అంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఈ ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని, మ‌రోసారి లాక్‌డౌన్ విధించే యోచ‌న లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తోంది. నిజానికి ఈ నెలాఖ‌రు వ‌ర‌కు దేశంలో లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. కానీ, చాలా మేర‌కు స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో లాక్‌డౌన్ ఉన్నా లేన‌ట్లే అనేలా ప‌రిస్థితి ఉంది. దేశ‌మంతా సాధార‌ణ జీవ‌నం మొద‌లైంది.

ప్ర‌జ‌లు రోడ్లెక్కుతున్నారు. వ్యాపారాలు మొద‌ల‌య్యాయి. చాలావ‌ర‌కు ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప‌ని చేస్తోంది. స‌డ‌లింపుల కార‌ణంగానే దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతోంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే, 130 కోట్ల‌కు పైగా జ‌నాభా క‌లిగిన భార‌త‌దేశంలో మూడు ల‌క్ష‌ల కేసులు న‌మోదు కావ‌డం పెద్ద ప్ర‌మాద‌క‌రం ఏమీ కాద‌ని నిపుణులు చెబుతున్నారు. పైగా భార‌త్‌లో క‌రోనా వైర‌స్ క‌మ్యూనిటీ స్ప్రెడ్ లేద‌ని ఐసీఎంఆర్ చెబుతోంది. కేంద్రం చెబుతున్న దాని ప్ర‌కారం మ‌ళ్లీ దేశంలో లాక్‌డౌన్ విధించే అవ‌కాశాలు ఏ మాత్రం క‌నిపించ‌డం లేదు.

నిజానికి రెండు నెల‌ల పాటు దేశం సంపూర్ణ లాక్‌డౌన్‌లో ఉంది. సువిశాల భార‌త దేశంలో క‌రోనా వ్యాప్తిని క‌ట్ట‌డి చేయాలంటే లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గ‌మ‌ని నిపుణులు భావించారు. కానీ, క‌రోనా వ్యాప్తి వేగాన్ని లాక్‌డౌన్ త‌గ్గించింది కానీ పూర్తిగా లాక్‌డౌన్ స‌ఫ‌ల‌మైంద‌ని మాత్రం చెప్ప‌లేని ప‌రిస్థితి. పైగా లాక్‌డౌన్ కార‌ణంగా దేశంలో ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా క్షీణించింది. ప్ర‌జ‌లు ఉపాధి కోల్పోయారు. పేద‌లు ఇబ్బందులు ప‌డ్డారు. దీంతో ఇక ఎక్కువ కాలం లాక్‌డౌన్ కుద‌ర‌ద‌ని భావించిన కేంద్రం స‌డ‌లింపులు ఇవ్వ‌డం మొద‌లుపెట్టింది. ఇప్ప‌టికిప్పుడు క‌రోనాను క‌ట్ట‌డి చేసే ప‌రిస్థితి లేనందున ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా క‌రోనాను ఎదుర్కోవ‌డం ఒక్క‌టే మార్గంగా ప్ర‌భుత్వం భావిస్తోంది.

అయితే, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ఢిల్లీ, గుజ‌రాత్‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌మాద‌ఘంటిక‌లు మొగిస్తోంది. ఈ రాష్ట్రాల్లో ప‌రిస్థితి తీవ్రంగా మారింది. క‌రోనా బాధితుల‌కు స‌రైన చికిత్స కూడా అంద‌టం లేదు. రోజురోజుకూ ఇక్క‌డ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మిగ‌తా రాష్ట్రాల్లోనూ కొన్ని న‌గ‌రాలు, జిల్లాల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తిగా వేగంగా ఉంది.

హాట్‌స్పాట్ల‌లోనే వైర‌స్ ఎక్కువ‌గా వ్యాపిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు. మ‌రోవైపు హైద‌రాబాద్‌లోనూ క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న దృష్యా మ‌రోసారి న‌గ‌రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించే అంశంపై త్వ‌ర‌లో కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ తెలిపారు. ఇక‌, 16 లేదా 17వ తేదీన ప్ర‌ధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడ‌బోతున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ కాక‌పోయినా మ‌రికొన్ని కీల‌క నిర్ణ‌యాలు ఈ స‌మావేశంలో తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయి.

 

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   38 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   31 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle