newssting
BITING NEWS :
*అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం *నా వల్ల.. వంశీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారంటూ టీడీపీ అడ్డగోలు కామెంట్లు - మంత్రి కొడాలి నాని *సీఎం జగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది..?-మంత్రి నాని *ఆర్టీసీ, రవాణాశాఖాదికారులతో సీఎం కేసీఆర్ భేటీ*శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ప్రమాదం లేదంటున్న డ్యామ్ సేఫ్టీ అధికారులు *తూ.గో: ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్*విజయవాడ: స్టెల్లా కాలేజీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత*2021 అసెంబ్లీ ఎన్నికలు అద్భుతాలు ఖాయం-రజనీకాంత్

కలకలం రేపుతున్న కమల్ వ్యాఖ్యలు

13-05-201913-05-2019 15:03:45 IST
Updated On 28-06-2019 12:57:01 ISTUpdated On 28-06-20192019-05-13T09:33:45.914Z13-05-2019 2019-05-13T09:33:33.441Z - 2019-06-28T07:27:01.691Z - 28-06-2019

కలకలం రేపుతున్న కమల్ వ్యాఖ్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినీనటుడు, మక్కల్‌ నీది మయ్యుం పార్టీ వ్యవస్థాపకుడైన కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపారు. స్వతంత్ర్య భారత్‌లో ‘తొలి తీవ్రవాది హిందూ’ అని వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్‌ గాడ్సేను ఉద్దేశిస్తూ ఆయన ఈ విమర్శలు చేయడంతో విమర్శలు వస్తున్నాయి. తమిళనాడులోని అరవకురిచిలో ఓ ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు.

దేశంలోని ప్రజలంతా సమానత్వంతో జీవించాలని  కోరుకునే భారతీయుల్లో తానూ ఒకడినని అభిప్రాయపడ్డారు. త్రివర్ణ పతాకంలోని మూడు రంగులు వివిధ వర్గాల విశ్వాసాలను సూచించినట్లుగానే తాను కూడా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటానని వ్యాఖ్యానించారు. 

అంతవరకూ బాగానే ఉంది. ప్రసంగం తర్వాత పాఠం మీద వివాదానికి హేతువైంది. ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్న కారణంగా నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. గాంధీ విగ్రహం ఎదుట నిలబడి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. స్వాతంత్ర భారత్‌లో తొలి తీవ్రవాది హిందూ.. ఆయన పేరు నాథూరామ్‌ గాడ్సే. అప్పటి నుంచే ఈ ఉగ్రవాదం ప్రారంభమైంది అని వ్యాఖ్యానించడంతో హిందూ సంఘాలు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నాయి.

ఒక గాంధేయవాదిగా ఆయన హత్యకు గల కారణాలను తెలుసుకోవాలనుకుంటున్నానని కమల్‌ ఈసందర్భంగా అభిప్రాయపడ్డారు. వివాదాలు కమల్‌కి తక్కువేం కాదు. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. 2017 నవంబరులో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘హిందూ తీవ్రవాదం’ అనే పదజాలం ఉపయోగించారు. కమల్‌ వ్యాఖ్యల్ని అప్పట్లో బీజేపీతో పాటు పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.  మే 19న అరవకురిచి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఎమ్‌ఎన్‌ఎమ్‌ తరఫున ఇక్కడి నుంచి మోహన్‌రాజ్‌ అనే అభ్యర్థి బరిలోకి దిగారు. ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన కమల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్‌ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని బిజెపి నేతలు పేర్కొన్నారు. గాడ్సేపై కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలను బిజెపి తప్పుబట్టింది. ఎన్నికల్లో లబ్ధి కోసమే కమల్‌ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి విమర్శించింది. కమల్‌ క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్‌ చేసింది. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle