కర్నాటక సర్కార్‌పై కాంగ్రెస్ నారాజ్
27-06-201927-06-2019 14:44:01 IST
Updated On 27-06-2019 15:59:26 ISTUpdated On 27-06-20192019-06-27T09:14:01.366Z27-06-2019 2019-06-27T08:06:37.735Z - 2019-06-27T10:29:26.539Z - 27-06-2019

కర్ణాటక ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీకి బెంగ పట్టుకుందట. జనతాదల్ సెక్యులర్ పార్టీతో పొత్తు ప్రభుత్వం కొనసాగిస్తున్న కాంగ్రెస్ నేతలకు, అధికారం ఉంటుందా, ఊడుతుందా అన్న మీమాశంలో పడ్డారట. ఎందుకంటే, కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయం అంటూ జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ కామెంట్ చేయడం, కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదట. అంతేకాదు, తన కుమారుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి కుర్చీ మీద వ్యామోహం లేదనీ, న్యాయబద్దమైన డిమాండ్లను నెరవేర్చినా కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆశ తీరడం లేదన్న దేవెగౌడ ఆరోపణ మీద తీవ్రంగా చర్చిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే తాము పొత్తు ప్రభుత్వం ఏర్పాటు చేశామనీ ఆరోపించిన దేవెగౌడ ఆ తర్వాత తన మాటలను మీడియా వక్రీకరించిందన్నారు. అయితే ఆయన తన ప్రకటన మీద వివరణ ఇచ్చినా, ఆయన అంతంగం ఏంటో అర్థం చేసుకున్న కాంగ్రెస్ నేతలు, పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణాల మీద సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది. ఎందుకంటే, ప్రభుత్వం మీద అనవసరమైన ఆరోపణలు చేయడం మానుకోవాలనీ, మాజీ సీఎం సిద్ధరామయ్యను అదుపులో పెట్టాలంటూ రాహుల్ గాంధీకి నేరుగా దేవెగౌడ చెప్పడంతో, కర్ణాటక నేతలతో రాహుల్ గాంధీ చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం ఎన్నాళ్లు కొనసాగుతుందో తమ చేతిలో ఏం లేదనీ, కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉందంటూ కర్ణాటక సీఎం కుమారస్వామి కామెంట్ చేయడంతో, సిద్ధరామయ్యను మందలించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పెద్దలు. అయితే వారి మాటలను ఏమాత్రం పట్టించుకోని సిద్ధరామయ్య నోటికి వచ్చినట్లు కుమారస్వామి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీంతో జిల్లా స్థాయిలో కాంగ్రెస్, జేడీఎస్ నేతల మధ్య వైరం మరింత ముదిరింది. పరిస్థితి మరింత చేయి దాటకుండా చూసేందుకు సిద్ధరామయ్యను పార్టీ జాతీయ కమిటీలో బాధ్యతలు అప్పిగిస్తామనీ, వెంటనే ఢిల్లీ రావాలంటూ కాంగ్రెస్ అధిష్టానం, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కే.సీ. వేణుగోపాల్ ద్వారా కబురు పంపింది. అయితే జాతీయ స్థాయిలో పార్టీ బాధ్యతలు తనకు అవసరం లేదంటూ మాట దాటేశారట సిద్ధరామయ్య. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడిందట. ఓవైపు కర్ణాటక ప్రభుత్వం మీద బీజేపీ కన్నేసిందనీ, ఇప్పటికే చాలా మంది ఎంఎల్ఏలు ఆ పార్టీ వైపు చూస్తున్నట్లు గ్రహించిన కాంగ్రెస్ పెద్దలు, ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జనలు పడుతున్నారట. ఇదే సమయంలో ముస్లింలలో పట్టున్న కాంగ్రెస్ నేత, ఎంఎల్ఏ రోషన్ బేగ్ కామెంట్ కూడా వారిని కలవర పెడుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ముస్లింలు అందరూ బీజేపీకి ఓటేసి, ఆ పార్టీని అధికారంలోకి తేవాలన్న రోషన్ బేగ్ ప్రకటనతో ఆ వర్గం ఓట్లలో చీలిక వస్తుందనేది కాంగ్రెస్ పార్టీ భయం.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
11 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా