newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కర్నాటక రెబల్స్‌కు రిలీఫ్.. సుప్రీం కీలక తీర్పు

13-11-201913-11-2019 12:45:13 IST
2019-11-13T07:15:13.098Z13-11-2019 2019-11-13T07:15:02.973Z - - 22-04-2021

కర్నాటక రెబల్స్‌కు రిలీఫ్.. సుప్రీం కీలక తీర్పు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్నాటక రాజకీయాల్లో సంచలనం రేపిన రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది. కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్ పై సుప్రీం కోర్టు ఇవాళ సంచలన నిర్ణయం ప్రకటించింది.

అనర్హత వేటు పడిన 17 మంది రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్ విచారించిన ధర్మాసనం కీలక తీర్పు నిచ్చింది. జులైనెలలో ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ అప్పటి అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్  తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్ధించింది.

అదే సమయంలో ప్రస్తుత శాసనాసభా సమయం ముగిసే వరకూ ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు ఇవాళ్టి తీర్పులో కొట్టేసింది. దీంతో ఈ ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లయింది.

వీరు పోటీ చేయడంపై స్పీకర్ కేఆర్ సురేష్ కుమార్ నిర్ణయం తీసుకోజాలరని ధర్మాసనం పేర్కొంది. కుమారస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా అనర్హత వేటు పడిన వారిలో కాంగ్రెస్ నుంచి 14 మంది, జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

కర్నాటక అసెంబ్లీలో ఖాళీ అయిన 17 అసెంబ్లీ స్థానాల్లో 15 చోట్ల వచ్చే నెల 5న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. వీరి అసమ్మతి, రాజీనామా హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ మురారిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎన్‌వీ రమణ ఈ తీర్పు వెల్లడించారు.

మరోవైపు ఈ తీర్పుని ముఖ్యమంత్రి యడియూరప్ప స్వాగతించారు. రెబల్ ఎమ్మెల్యే ఏహెచ్ విశ్వనాథ్, సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తాము విజయం సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. వీరంతా త్వరలో బీజేపీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. 

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle