newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కర్నాటక మాజీ సీఎం సిద్దరామయ్యకు కరోనా పాజిటివ్

04-08-202004-08-2020 09:41:04 IST
2020-08-04T04:11:04.801Z04-08-2020 2020-08-04T04:10:48.936Z - - 19-04-2021

కర్నాటక మాజీ సీఎం సిద్దరామయ్యకు కరోనా పాజిటివ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా కేసులు పరుగులు పెడుతున్నాయి. వీఐపీలు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్నారు. కరోనా వైరస్ బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. హోంమంత్రి అమిత్ షా కరోనా బారిన పడి మేదాంత ఆస్పత్రిలో చికిత్స అందుకుంటున్నారు. తమిళనాడు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ అవే లక్షణాలతో హోమ్ క్వారంటైన్‌కు వెళ్లిపోయారు.తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్దరామయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆసుపత్రిలో చికిత్స పొండుతున్నానని.. తనతో కాంటాక్టులో ఉన్నవారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.

”నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ముందు జాగ్రత్తగా డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరాను. నాతో సంప్రదించిన వారందరూ కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలి. అంతేకాకుండా స్వీయ నిర్భందంలో ఉండాలని అభ్యర్ధిస్తున్నాను” అని సిద్దరామయ్య ట్వీట్ చేశారు. సిద్ధరామయ్య కుమారుడు, ఎమ్మెల్యే డాక్టర్ యతీంద్ర సిద్ధరామయ్య వెల్లడించారు.

ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారు వెంటనే కరోనా వైద్య పరీక్షలను చేయించుకోవాలని సిద్ధరామయ్య సూచించారు. డాక్టర్లను సంప్రదించాలని, వీలైతే క్వారంటైన్లకు వెళ్లాలని పేర్కొన్నారు. యడియూరప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న సభలు, సమావేశాల్లో సిద్దరామయ్య పాల్గొంటున్నారు. ఆవిధంగా ఆయనకు కరోనా సోకిందంటున్నారు. 

ఇదిలా ఉంటే కర్నాటకలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతోంది. ఇంతకుముందే కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా పాజిటివ్ వచ్చిందని ట్వీట్ చేశారు. ఆయన మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో తాను ఆసుపత్రిలో చేరానని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని పేర్కొన్నారు. డాక్టర్ల సలహా మేరకు తాను ముందుజాగ్రత్త చర్యగా తాను ఆసుపత్రిలో చేరినట్టు చెప్పారు. 

 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   38 minutes ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   19 minutes ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   5 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   6 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   2 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   9 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   9 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   an hour ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   3 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   9 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle