newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కర్నాటక ప్రయత్నం.. శానిటైజర్ టన్నెల్ బస్

14-04-202014-04-2020 09:24:42 IST
Updated On 14-04-2020 10:25:48 ISTUpdated On 14-04-20202020-04-14T03:54:42.287Z14-04-2020 2020-04-14T03:51:34.729Z - 2020-04-14T04:55:48.375Z - 14-04-2020

కర్నాటక  ప్రయత్నం.. శానిటైజర్ టన్నెల్ బస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతోంది. కరోనా పాజిటివ్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి కాటుకు వందలాది మంది బలైపోతున్నారు. ఈ వైరస్‌ బారిన పడినవారి సంఖ్య క్రమంగా 10 వేలకు చేరుకుంటోంది. దేశంలో కరోనా కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల్లో 35 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 22 మంది, ఢిల్లీలో ఐదుగురు, గుజరాత్‌లో ముగ్గురు, పశ్చిమబెంగాల్‌లో ఇద్దరు, తమిళనాడులో ఒకరు, జార్ఖండ్‌లో ఒకరు, ఆంధ్రప్రదేశ్‌లో ఒకరు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 324కి చేరింది.

కరోనా నియంత్రణకు తరచుగా చేతులు కడుక్కోవడం, శానిటైజర్లు వాడటం ఎంతో ముఖ్యం. పలు ప్రాంతాల్లో 'బాడీ శానిటైజింగ్' పేరిట శరీరమంతా శానిటైజర్ వెదజల్లే యంత్రాలు ఏర్పాటుచేస్తున్నారు. కానీ వీటిని కొనుగోలు చేయాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న పనే. అయితే అతి తక్కువ వ్యయంతో, నిరుపయోగమైన బస్సులను వినియోగించి శానిటైజింగ్ టన్నెల్స్ తయారు చేస్తోంది కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.

ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడే ప్రదేశాల్లో అధికారులు ఈ మొబైల్ టన్నెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ టన్నెల్స్  లోపలి భాగంలో.. వైరస్ ను నిరోధించే క్రిమి సంహారకాలు వెదజల్లే విధంగా రూపొందిస్తారు. ప్రజలు ఇందులో నుంచి వెళ్తే పూర్తిగా శానిటైజ్  అవుతారు. పోలీసులు, వైద్య సిబ్బంది, అత్యవసర విపత్తు స్పందన దళం, పారిశుద్ధ్య కార్మికులకు ప్రస్తుతం ఈ బస్సు టన్నెల్ ను అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు రెండు బస్ టన్నెల్స్ ను తయారు చేశారు. ఈ బస్సులకు 'రవాణా సంజీవని'గా నామకరణం చేశారు.

శానిటైజర్ బస్సు ముందు ద్వారం నుంచి ప్రజలు లోపలకు వెళ్లాలి. వెనుక ద్వారం నుంచి బయటకు రావాలి. ఇందులో నడుస్తున్న సమయంలో బస్సులో ఏర్పాటు చేసిన వ్యవస్థ నుంచి వైరస్ ను నిరోధించే సంహారకాలు వెలువడతాయి. మైసూరుకు చెందిన 12 ఏళ్ల బాలుడు నిరుపయోగంగా ఉన్న బస్సులను శానిటైజర్ టన్నెల్ గా మార్చాడు. రూ.12 వేల వ్యయంతో దీని తయారు చేసినట్లు తెలుస్తోంది. వీటిని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజిలెన్స్ డైరెక్టర్ డా. రామ్ విలాస్ సేపత్... మైసూరు రూరల్ డివిజన్ డిపో వద్ద లాంఛనంగా ప్రారంభించారు.

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   37 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   30 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle