newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కర్నాటకలో ఉప ఎన్నికలు వాయిదా – యెడియూరప్పకు ఊరటేనా?

28-09-201928-09-2019 00:31:42 IST
2019-09-27T19:01:42.904Z28-09-2019 2019-09-27T19:01:31.308Z - - 17-04-2021

కర్నాటకలో ఉప ఎన్నికలు వాయిదా – యెడియూరప్పకు ఊరటేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్నాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఈ పరిణామం క‘ర్నాటకం’లో తీవ్ర ఒత్తిడిలో ఉన్నముఖ్యమంత్రి  యెడియూరప్పకు ఒకింత ఊరట కలిగించడం ఖాయం. ఎందుకంటే కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా అప్పటి స్పీకర్ 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో వారు తమ శాసన సభ్యత్వాన్ని కోల్పోయారు.

అందుకే కర్నాటకలో 15 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరగాల్సిన అనివార్యత ఏర్పడింది. అయితే స్పీకర్ అనర్హత వేటు కారణంగా ఈ నియోజకవర్గంలో తాజా మాజీలుగా అ పది హేను మందీ పోటీని అనర్హులు. ఇక్కడే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకూ, ముఖ్యమంత్రి యెడియూరప్పకూ కూడా చిక్కు వచ్చి పడింది. ఉప ఎన్నికలు జరిగితే...ఈ 15 నియోజవకర్గాలలో కనీసం ఐదింటిలో గెలిస్తేనే యెడియూరప్ప సర్కార్ స్థిరంగా ఉంటుంది.

దీంతో ఉప ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించగానే రాష్ట్రంలో రాజకీయ సందడి ఒక్క సారిగా ప్రారంభమైంది. అయితే అనర్హత వేటు కారణంగా పోటీ చేయడానికి అవకాశం లేకపోవడంతో తాజా మాజీలు కోర్టును ఆశ్రయించారు. దేశ సర్వోన్నత న్యాయ స్థానంలో ఈ కేసు పెండింగ్ లో ఉండటంతో అది తేలేవరకూ ఈ 15 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు నిర్వహించరాదని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇదే విషయాన్ని సుప్రీంకూ తెలియజేసింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం వచ్చే నెల 21న ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది.

దీంతో కర్నాటకలో మరో రాజకీయ సమరం తాత్కాలికంగా వాయిదా పడింది. కోర్టు తీర్పు అనర్హత ఎమ్మెల్యేలకు అనుకూలంగా వస్తే యెడియూరప్ప సర్కార్ కు ఢోకా లేనట్టే. అయితే ఈ 15 కూడా బీజేపీ సిట్టింగ్ సీట్లు కాకపోవడం బీజేపీని కలవరపెడుతున్నది. అనర్హత ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలో పెటీకి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇస్తే...యెడియూరప్ప సర్కార్ కు నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. అలా కానట్లయితే...విపక్ష స్థానాలలో పాగా వేయడానికి బీజేపీ చెమటోడ్చక తప్పదు.

ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఉప ఎన్నికలను వాయిదా వేయడంతో అధికార విపక్షాలు వాటి వాటి అంచనాలలో తలమునకలయ్యాయి. అటు కాంగ్రెస్ కు, ఇటు బీజేపీకీ కూడా ఉప ఎన్నికల ఫలితం అత్యంత కీలకం కనుక ఉప ఎన్నికలలో గెలుపునకు హోరాహోరీ తలపడతాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు వాయిదా పడటంతో ఇరు పక్షాలూ కూడా తమతమ వ్యూహాలకు పదును పెడతాయనడంలో సందేహం లేదు. 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   17 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   15 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle