newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క‘ర్నాటకం’ మళ్లీ షురూ..!

23-09-201923-09-2019 16:05:17 IST
2019-09-23T10:35:17.794Z23-09-2019 2019-09-23T10:35:14.569Z - - 14-04-2021

క‘ర్నాటకం’ మళ్లీ షురూ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్నాటక రాజకీయ రంగస్థలంపై మళ్లీ నాటకానికి తెరలేచింది. కర్నాటకలో అనర్హత పడిన 17 మంది ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. కాగా ఇప్పటికే అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన 15 నియోజకవర్గాలలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇక అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలకూ ఈ ఉప ఎన్నికలో పోటీ చేసే అర్హత కోల్పోయారు. అంటే వీరు ఎన్నికల బరిలోకి దిగడానికి వీల్లేదు. 2023 వరకూ ఈ నిషేధం ఉంటుంది.

ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు అనర్హత ఎమ్మెల్యేల కేసు విచారణకు స్వీకరించడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఉప ఎన్నిక జరగనున్న 17 నియోజకవర్గాలలో కనీసం ఆరు స్థానాలలో బీజేపీ విజయం సాధిస్తేనే యెడ్యూరప్ప ప్రభుత్వం సజావుగా సాగే అవకాశం ఉంటుంది. లేకుండా ఆయన సర్కార్ కూడా గత కుమారస్వామి ప్రభుత్వంలా డోలాయమానంలో పడుతుంది. దినదిన గండం నూరేళ్లాయష్షు అన్నట్టుగా తయారౌతుంది. ఇంతకీ అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించింది...ఉప ఎన్నికలో తమకు పోటీ చేసే అవకాశం ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని. ఈ కేసులు జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

దీంతో కర్నాటక రాజకీయం రసకందాయంలో పడినట్లే. అనర్హత ఎమ్మెల్యేల పోటీకి సుప్రీం ఆమోదం తెలిపితే...యెడ్యూరప్ప సర్కార్ కు తాత్కాలికంగానైనా సరే గండం గడిచిందనే భావించాల్సి ఉంటుంది. తీర్పు అందుకు భిన్నంగా వస్తే మాత్రం మరో సారి కర్నాటక రాజకీయాలలో హార్స్ ట్రేడింగ్ కు తెర లేచే అవకాశాలు మెండుగా ఉంటాయి. కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివకుమార్ అరెస్టు తదితర పరిణామాలతో రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ సుస్థిరత లక్ష్యంగా విపక్షంలో బలమైన నేతలను కేంద్రం టార్గెట్ చేసిందన్న ఆరోపణలకు బలం చేకూరింది.

ఇక 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన అప్పటి కర్నాటక స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు 2023 వరకూ ఏ ఎన్నికలలోనూ పోటీ చేయరాదని నాటి ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పొందుపరుస్తూ అనర్హత ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించడం స్పీకర్ రాజ్యాంగ విధుల్లో జోక్యం కిందికే వస్తుందని ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ లు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తరువాత ఎమ్మెల్యేల పిటిషన్ సుప్రీం విచారణకు స్వీకరించడంతో రాష్ట్ర రాజకీయాలలో కొత్త ఉత్కంఠకు తెరతీసింది.

మరో సారి రాష్ట్రంలో అస్థిర పరిస్థితులు ఏర్పడటానికి ఈ పరిణామం దారితీస్తుందన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. తీర్పు సంగతి పక్కన పెడితే...యెడ్యూరప్ప ప్రభుత్వం భద్రంగా ఎంత మాత్రం లేదనడానికి ఆయన మంత్రివర్గ విస్తరణ ఊసెత్తకపోవడాన్ని ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అదే సమయంలో ప్రస్తుత మంత్రివర్గంలో యెడియూరప్ప అనుయాకులకు స్థానం లేకపోవడం, వారు అసమ్మతి రాగం ఎత్తుకోవడంతో ఉప ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాలలో మరో పెను కుదుపు తప్పదని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు నిర్ధారణకు వచ్చేశారు.   

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   3 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   an hour ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   2 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   4 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   21 hours ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   20 hours ago


ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle