newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కర్ణాటక ఎమ్మెల్యేల జీతాల తగ్గింపు.. మరి మిగతా రాష్ట్రాల సంగతేమిటి?

24-09-202024-09-2020 15:15:00 IST
2020-09-24T09:45:00.747Z24-09-2020 2020-09-24T09:44:57.846Z - - 12-04-2021

కర్ణాటక ఎమ్మెల్యేల జీతాల తగ్గింపు.. మరి మిగతా రాష్ట్రాల సంగతేమిటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ మహమ్మారి కరోనా నేపథ్యంలో అన్ని వ్యవస్థలూ ఆర్థికంగా కుదేలయ్యాయి. ప్రభుత్వాలు కరోనాపై పోరాటంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రాల వరకూ ఏవీ ఈ విషయంలో మినహాయింపు కాదు. అయితే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో మాత్రం కేంద్రం ఒక తీరుగా, రాష్ట్రాలు వేటికవే వేర్వేరుగా చర్యలు తీసుకుంటున్నాయి. చాలా  రాష్ట్రాలు ప్రభుత్వోద్యోగుల జీతాలలో కోత విధించాయి.

అయితే దాని వల్ల ప్రభుత్వానికి ఆదా అయ్యేదెంతన్నది పక్కన పెడితే... ప్రభుత్వోద్యోగుల జీతాలలో కోత విధించిన ప్రభుత్వాలు మంత్రులు ఎమ్మెల్యేల వేతనాల జోలికి మాత్రం పోలేదు. ఈ విషయంలో సహజంగానే విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రం నిధులు విడుతల చేయడం లేదనీ, క్లిష్ట పరిస్థితుల్లో నిబంధనలను పక్కన పెట్టైనా సరే రాష్ట్రాలను ఆదుకోవడానికి ముందుకు రావాలన్న డిమాండ్లు పెచ్చరిల్లాయి.

కేంద్రం కూడా రాష్ట్రాలకూ, కుదేలైన రంగాలకు మేలు చేసి... అవి పుంజుకునేందుకోసమే అంటూ ఆత్మ నిర్భర్ పేర భారీ ప్యాకేజీని ఆర్భాటంగా ప్రవేశ పెట్టింది. అయితే ఈ విషయంలో కర్నాటక రాష్ట్రం మాత్రం ఒక అడుగు ముందుకు వేసింది. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ఎమ్మెల్యేల జీత భత్యాల్లో కోత విధించాలని నిర్ణయించింది.

ప్రజా సేవకులమంటూ ఎన్నికల రణరంగంలో దిగి, వాగ్దానాల వర్షం కురిపించి చట్ట సభ సభ్యులుగా ఎన్నికైన వారు తమ సేవకు వేతనం తీసుకోవడం, అదీ ప్రస్తుత సంక్షోభ సమయంలో ఏ విధంగా చూసినా అభ్యంతరకరమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతన్న వేళ.. కర్నాటక సర్కార్ ఏదో మేరకు చట్ట సభల సభ్యులు కరోనా కష్ట కాలంలో కూడా పూర్తి వేతనాలు తీసుకోవడం సరికాదన్న అభిప్రాయంతో ఒక అడుగు వేసింది.

ఎమ్మెల్యేల జీత భత్యాలలో 30శాతం కోత విధుస్తూ..అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టింది. ఆ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందింది. అయితే చట్ట సభ సభ్యుల వేతనాల్లో కోత వల్ల ఆదా అయ్యేది కేవలం 18 కోట్లు మాత్రమే అని పెదవి విరవాల్సిన పని లేదు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా కర్నాటక ప్రభుత్వం సంక్షోభ సమయంలో ఒక నిర్ణయం తీసుకుని దానికి అసెంబ్లీ ఆమోదం పొందింది.

మరి ఈ విషయంలో మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే బాటన నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిథులు  తమ సౌకర్యాలు, హక్కుల విషయంలో ఇసుమంతైనా రాజీ పడకుండా, భారమంతా ప్రజలపైనే వేసేలా వ్యవహరించడం ఏ విధంగా చూసినా సముచితం కాదు. కరోనా కారణంగా ఉపాధి, ఉత్పత్తికి గండి పడి నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్న పరస్థితుల్లో సామాన్యుడిని ఆదుకోవడానికి చర్యలు తీసుకోవడం అటుంచి వారిపైనే కోవిడ్ సెస్ పేరిట భారం మోపుతున్న  ప్రభుత్వాలకు కర్నాటక సర్కార్ నిర్ణయం కనువిప్పు కావాలి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle