కరోనా సమస్యలే పార్లమెంటులో చర్చించాలి!
15-09-202015-09-2020 16:07:30 IST
2020-09-15T10:37:30.865Z15-09-2020 2020-09-15T10:37:28.292Z - - 10-04-2021

పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి. పార్లమెంటు వేదికగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చర్చ సాగాలి. అయితే ఇప్పటి వరకూ పార్లమెంటు సమావేశాల తీరు అందుకు భిన్నంగా ఉందన్న అభిప్రాయాం సర్వత్రా ఉంది. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి విదితమే. ముఖ్యంగా భారత్ లో కరోనా వ్యాప్తి తీవ్రత ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. ఈ కరోనా బాధిత ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన ప్రజానీకాన్ని ఆదుకోవడానికి కంటే మోడీ సర్కార్ తీసుకున్న చర్యలు ఏ ఒక్కరినీ సంతృప్తి పరిచేవిగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఉభయ సభల్లో కరోనా సమస్యలపై చర్చించి, ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలకు శ్రీకారం చుట్టాలి. ఆరు నెలలుగా ప్రజలు నానాయాతన పడుతున్న వేళ అధికార, విపక్షం అన్న తేడా లేకుండా పార్లమెంట్ లో సమస్యలను చర్చించి దేశాన్ని, ప్రజలను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ కరోనా వ్యాప్తి ధాటికి, తీవ్రతకు కుదేలైంది. అయితే కరోనా పిడుగుతో మన దేశ ఆర్థికవ్యవస్థ వేగంగా పతనావస్థకు పరుగులు తీస్తున్న పరిస్థితి ఏర్పడింది. పారిశ్రామిక ఉత్పత్తి దారుణంగా క్షీణించింది. ఉత్పత్తి రంగం కుదేలైంది. ఇప్పటికీ పలు సంస్థలు, పరిశ్రమలూ మూతపడే ఉన్నాయి. ఉపాధి క్షీణత, వేతనాల తగ్గుదల వలనే వేతన ఆదాయాలు పాతాళానికి పడిపోయాయి. వ్యవసాయ రంగం మినహా ఉపాధి అవకాశాలు ఉండే అన్ని రంగాలూ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. అనుకూల రుతుపవనాలు, మంచి పంట దిగుబడులు వ్యవసాయ రంగాన్ని కాపాడాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఉదారంగా చేసిందేమీ లేదు. కానీ వాస్తవంగా కరోనా కారణంగా కుదేలైన రంగాలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆత్మనిర్భర్ భారత్ అంటూ ఉద్దీపనలు ప్రకటించి...మహా గోప్ప మేలు చేశామని ప్రజలను నమ్మించడానికి కేంద్రం చేస్తున్నది విఫలయత్నంగా మాత్రమే మిగిలిపోతుంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీని ఆదుకునే విషయంలో మోడీ సర్కార్ ఏ రకరమైన ఉదారతనూ చూపడంలేదు. ఈ దశలో పార్లమెంట్ సభ్యులు ఉమ్మడి కార్యాచరణగా వివిధ రంగాల్లో కరోనా ప్రభావాలను చర్చించి, ప్రజలపై పడ్డ భారం, వారి జీవన ప్రమాణాలపై అది చూపిన ప్రభావంపై చర్చించాల్సిన అవసరం ఉంది. విశాల ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉపశమన స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం ప్రకటించే విధంగా చర్చలలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సమాజంలో సామాన్యుడి ఆదాయం బాగా తగ్గింది. ఆ కారణంగా సగటు జీవి ఆదాయం పడిపోయింది. ఆ కారణంగానే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించే అవకాశాలు తక్కువే. అదే విధంగా ప్రభుత్వ పెట్టుబడి కూడా గణనీయంగా తగ్గుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పలు రాష్ట్రాలు ప్రభుత్వోద్యోగులకు సకాలంలో జీతాలు అందించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. జిఎస్టీ ఆదాయాలు కూడా కేంద్రం రాష్ట్రాలకు చెల్లించడం లేదు. ఇ ప్పటికైనా ఆర్థిక వ్యవస్థ, వైద్య విధానాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోకుంటే ఈ భయంకరమైన పరిస్థితి అంతం లేకుండా ఇలాగే కొనసాగే పరిస్థితి ఉంది. ఈ విషయంపై పార్లమెంటు సభ్యులంతా పార్లమెంటు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజాక్షేమం, ఆరోగ్య రక్షణ ధ్యేయంగా అర్ధవంతమైన, సమర్ధమైన చర్చ జరిపి..సమస్యల పరిష్కారం కోసం కేంద్రం అవసరమైన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
5 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
an hour ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
8 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
11 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
12 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా