newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా సంక్షోభం... రఘురామ్ రాజన్‌తో రాహుల్ ముచ్చట

30-04-202030-04-2020 18:10:09 IST
Updated On 30-04-2020 19:13:37 ISTUpdated On 30-04-20202020-04-30T12:40:09.793Z30-04-2020 2020-04-30T12:39:03.978Z - 2020-04-30T13:43:37.092Z - 30-04-2020

కరోనా సంక్షోభం... రఘురామ్ రాజన్‌తో రాహుల్ ముచ్చట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా ప్రపంచం కష్టాల్లో పడింది. ఆర్థిక వ్యవస్థ ప్రమాదంతో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వాలు ఈ ఉత్పాతం నుంచి బయటపడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా ప్రారంభం అయిన నాటినుంచి కాంగ్రెస్ పార్టీ పలు సూచనలు అందిస్తోంది. తాజాగా 'కరోనా వైరస్ మహమ్మారి- ఆర్థిక వ్యవస్థపై ప్రభావం'పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రఖ్యాత ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ మాజీ చీఫ్ రఘురామ్‌ రాజన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు.. ఈ ఇంటర్వ్యూలో కీలక సూచనలు చేశారు రఘురామ్ రాజన్.

కరోనా కారణంగా మధ్యతరగతి, పేదలు తీవ్ర సంక్షోభంలో పడ్డారని, పేదలకు సహాయం చేయడానికి ఎంత అవసరం అని రాహుల్ ప్రశ్నిస్తే రూ.65,000 కోట్లు అవసరం అన్నారు రఘురామ్ రాజన్. కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఒక మార్గాన్ని రూపొందించడంలో మేధావులతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడంలో ఇది మొదటిది.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం వంటి నిపుణుల నుండి "ట్యూషన్లు తీసుకోవాలి" అంటూ బీజేపీ నేతలు రాహుల్‌ గాంధీని ఎగతాళి చేస్తున్న వేళ ఇప్పుడు ఈ దారిని ఎంచుకున్నారు రాహుల్ గాంధీ. 

మున్ముందు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక నిపుణులతో ఇటువంటి పరస్పర చర్యలను నిర్వహించాలని రాహుల్ భావిస్తున్నారు. రాహుల్ గాంధీ, రఘురామ్ రాజన్ మధ్య పరస్పర చర్చ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ట్విట్టర్, ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్‌లో ప్రసారం అయ్యింది. ఇది వైరల్ అయింది. భారతదేశంలో మీరు చూసే అసమానత స్థాయి ఎక్కడా కనిపించదు. యుఎస్‌లో తీసుకున్న చర్యలను మీరు భారతదేశంతో పోల్చలేరు.. మన సమాజాలు చాలా భిన్నమైనవి.. కులం అటువంటి అంశం అని రాహుల్ ప్రశ్నించగా.. అమెరికాకు భిన్నంగా మనకు భిన్నమైన సమాజ నిర్మాణం ఉన్నందున మొత్తం భారతదేశానికి ఒకటే పరిష్కారం ఉండకూడదు అన్నారు రాజన్. 

ఇదిలా వుంటే రఘురామ్ రాజన్ ...భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ పై ప్రభావం ఎలా వుంటుందని రాహుల్ గాంధీని అడిగారు. రాహుల్ గాంధీ "ఇది ఒకసారి ప్రభావవంతంగా ఉంది, మేం అధికారాన్ని కేంద్రీకృతం చేసే దిశగా పయనిస్తున్నామన్నారు. పంచాయితీ రాజ్ వ్యవస్థ బలోపేతం కావాలన్నారు. కోవిడ్ -19 తరువాత భారతదేశానికి వ్యూహాత్మక ప్రయోజనం ఉంటుందా? అని రాహుల్ ప్రశ్నించగా.. పరిస్థితిని దేశాలు సద్వినియోగం చేసుకోగల మార్గాలు ఉన్నాయి. పునరాలోచన ఉంటుంది. ఈ పరిస్థితిలో భారతదేశం తన పరిశ్రమకు అవకాశాలను అన్వేషించుకోగలదన్నారు రఘురాంరాజన్. 

మహమ్మారి కరోనా కేసుల విషయంలో భారత్‌, అమెరికాకు ఎంతో వ్యత్యాసం వుందన్నారు.  ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ కేసులు ఉన్నాయి.. అయితే, మన దగ్గర పరీక్షలు పెరగాలని రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ మరింతగా పెంచడం కాకుండా లాక్ డౌన్ ఎగ్జిట్ గురించి ఆలోచించి, తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   17 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   15 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle