newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా వైరస్ ఫ్రీ గోవా... ఎలా సాధ్యమైంది?

20-04-202020-04-2020 09:02:10 IST
Updated On 20-04-2020 10:48:53 ISTUpdated On 20-04-20202020-04-20T03:32:10.191Z20-04-2020 2020-04-20T03:32:04.020Z - 2020-04-20T05:18:53.288Z - 20-04-2020

కరోనా వైరస్ ఫ్రీ గోవా... ఎలా సాధ్యమైంది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మనదేశంలో కరోనా కేసులు ఏరోజుకారోజు పెరిగిపోతున్నాయి. ప్రతి రాష్ట్రంలో కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో తప్పితే మధ్యభారత్, దక్షిణ భారత్ కరోనా వైరస్ కేసులతో సతమతం అవుతున్నాయి. అయితే ఒక్క రాష్ట్రం మాత్రం కరోనా విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకుంది. దేశంలో అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన గోవా రాష్ట్రంలో క‌రోనా కేసులు జీరోకు ప‌డిపోయాయి. గోవాలో చివ‌రగా ఉన్న యాక్టివ్  కేసు నెగెటివ్ గా తేల‌డంతో క‌రోనా లేని రాష్ట్రంగా గోవా అవ‌త‌రించినట్టు సీఎం ప్రకటించారు.

క‌రోనాపై పోరు కొన‌సాగిస్తున్న భార‌త‌దేశానికి ..గోవా క‌రోనా ర‌హిత రాష్ట్రంగా మార‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని డాక్టర్లే చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ మాట్లాడారు. గోవాలో ఒక్క కేసు కూడా లేవ‌ని చెప్ప‌డం సంతోషంగా ఉందని, అందరికీ ధన్యవాదాలు చెప్పారు. మే 3వ తేదీ వ‌ర‌కు గోవా ప్ర‌జ‌లు లాక్ డౌన్ పాటించాలని, కరోనాను త‌రిమి కొట్టేందుకు స‌హ‌క‌రించాల‌ని సీఎం ప్ర‌మోద్ సావంత్ కోరారు. గోవాలో ఏప్రిల్ 3వ తేదీకి ముందు 7 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌యిన సంగతి తెలిసిందే. అనంతరం ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు. ఏప్రిల్ 3కి ముందుకు పాజిటివ్ గా తేలిన వారు కోలుకోవ‌డంతో కేసులు జీరోకు ప‌డిపోయాయి. నిజానికి గోవాకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా వుంటుంది. కరోనా లాక్ డౌన్ వల్ల పర్యాటకులు రావడం బాగా తగ్గిపోయింది. దీంతో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. అధికారులు కూడా పూర్తిగా నిబంధనలు అమలుచేశారు.

కరోనా పాజిటివ్ కేసులు నమోదుకానంత మాత్రాన అధికారులు, ప్రజలు రిలాక్స్ కావద్దని, దేశానికి ప్రమాదం పొంచి ఉందని, అప్రమత్తంగా ఉండాలన్నారు, గోవాలో 800 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 7గురికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అందులో ఆరుగురికి ట్రావెల్ హిస్టరీ వుండగా, మరొకరు పాజిగివ్ కేసు వచ్చిన వారి కుటుంబ సభ్యుడు. గోవా ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రం అయిందన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించే యోధులకు ఇది పరీక్షా సమయం అన్నారు సీఎం సావంత్. మూడురోజుల క్రితం వరకూ ప్రతి ఇంటిని సర్వే చేశామని, ఎలాంటి కరోనా లక్షణాలున్నా వెంటనే అప్రమత్తం చేయాలన్నారు.

కరోనా వ్యాప్తి ఎక్కువగా వున్న కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులను మే 3 వరకూ తెరిచే ప్రసక్తేలేదన్నారు. ప్రభుత్వ రవాణా వాహనాల ద్వారానే ప్రభుత్వ ఉద్యోగులను కార్యాలయాలకు తరలిస్తామన్నారు. టూ వీలర్ పై ఒకరికే అనుమతి వుంటుందన్నారు. రాష్ట్రంలో 1000 థర్మల్ గన్స్ అందుబాటులో వున్నాయని ఎవరైనా వీటి ద్వారా టెస్ట్ చేసుకోవచ్చన్నారు. సముద్రమార్గం ద్వారా గోవాలోకి వచ్చేవారిని క్వారంటైన్ కి తరలించి పరీక్షలు నిర్వహిస్తామన్నారు సీఎం సావంత్. 8వేల రూమ్ లు ఇందుకోసం అందుబాటులో వున్నాయన్నారు. 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   14 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   11 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   15 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   13 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   19 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle