newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా వైపరీత్యం కాదు.. మన జీవనశైలి దిద్దుబాటుదారు.. ఉపరాష్ట్రపతి వ్యాఖ్య

14-07-202014-07-2020 07:12:19 IST
2020-07-14T01:42:19.305Z14-07-2020 2020-07-14T01:42:16.803Z - - 15-04-2021

కరోనా వైపరీత్యం కాదు.. మన జీవనశైలి దిద్దుబాటుదారు.. ఉపరాష్ట్రపతి వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌ బంధనంలో చిక్కుకుని గత కొన్ని నెలల కాలంలో మనం గడిపిన జీవితంపై ప్రజలం తా ఆత్మశోధన చేసుకోవాలని, ఈ సమయంలో సరైన జీవిత పాఠాలు నేర్చుకున్నామో లేదో తమకు తాముగా అంచనా వేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. అనూహ్య అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన సన్నద్ధతతో ఉన్నామా అన్నది తరచి చూసుకోవాలని కూడా పిలుపునిచ్చారు. కోవిడ్‌–19కు కారణాలు, పర్యవసానాలపై ప్రజలతో తన భావనలు పంచుకునేందుకు వెంకయ్య నాయుడు ఫేస్‌బుక్‌ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘కరోనా కాలంలో జీవిత భావనలు’అన్న శీర్షికతో ఆయన తన అభిప్రాయాలను సంభాషణా శైలిలో వ్యక్తపరిచారు. 

ఈ సందర్భంగా పది ప్రశ్నలను సంధించారు. ‘ఈ ప్రశ్నలకు లభించే సమాధానాలే పలు జీవిత పాఠాలను నేర్పుతాయి. కోవిడ్‌–19 సంక్షోభంతో ఇళ్లకే పరిమితమై గత 4 నెలల్లో నేర్చుకున్న జీవిత పాఠాలను, జీవితంలో మార్పులను మదింపు చేసుకునేందుకు ఈ ప్రశ్నలు దోహదపడతాయి. కరోనా మహమ్మారిని కేవలం ఒక వైపరీత్యంగా మాత్రమే పరిగణించరాదు, మన జీవనశైలిని సంస్కరించే ‘దిద్దుబాటుదారు’గా, ‘సంస్కరణ కర్త’గా చూడాల్సిన అవసరం ఉంది’అని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. 

ఎలాంటి ఆతృతకు తావులేని జీవనవిధానం గడిపేందుకు ఆయన పలు సూచనలు చేశారు. సరైన ఆలోచన, జీవన విధానం, ఆరోగ్యవంతమైన జీవితం కోసం ఆహారాన్ని ఔషధంగా పరిగణించడం, సామాజిక బంధంతో ఒక అర్థవంతమైన జీవన విధానాన్ని అలవరచుకోవడం వంటి సూచనలను పొందుపరిచారు. వైపరీత్యాలకు గల కారణాలను గురించి ప్రస్తావించారు. ‘మొత్తం భూగోళం మానవులకోసమే అన్నట్టుగా మనుషులు పెత్తనం చెలాయించడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది’ అని అన్నారు.  

తల్లిదండ్రుల, పెద్దల సంరక్షణలో తాము చేస్తున్న తప్పులేమిటో గుర్తించారని, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనడానికి సన్నద్ధమయ్యారని, ఇన్నాళ్లూ కోల్పోయిందేమిటో తాము ఇళ్లకే పరిమితమైనపుడు గుర్తించారన్నారు. ‘మనమంతా సమానులుగా పుట్టాం. కాలం గడుస్తున్న కొద్దీ చివరకు సమా నత్వంలో భేదాలు తలెత్తాయి. కొన్ని వర్గాల కష్టాలను, కడగండ్ల తీవ్రతను ఈ మహమ్మారి ఎత్తిచూపింది’ అని అభిప్రాయపడ్డారు.  

ఆధునిక జీవనం నల్లేరు మీద నడకలా సాగితోందనే భ్రమల్లో ఉన్న సమయంలో కరోనా విజృంభించింది. 4 నెలల క్రితం ‘పాజ్‌’(విరామం) బటన్‌తో జీవితాన్ని స్తంభింపజేసింది. ‘రీసెట్‌’ బటన్‌ ద్వారా దానికి పునఃప్రారంభాన్ని చూపించింది. లాక్‌డౌన్‌ తర్వాత భవిష్యత్తు దిశగా జీవితాన్ని మళ్లీ సిద్ధం చేయాల్సిన అవసరాన్ని కల్పించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రెండు జీవన విధానాల మధ్య ఇదో సంధికాలం’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. జీవితాన్ని బేరీజు వేసుకొని మళ్లీ ముందుకు సాగబోతున్నామని తెలిపారు.

సంపదే సర్వస్వం కాదన్నది కరోనా నేర్పిన పాఠం. సంపద కన్నా ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యం అని గుర్తించాలి. సుఖవంతమైన జీవితమే పరమార్థం కారాదు. అది అన్నింటికీ మించినది. అందరితో పంచుకోవడం, అందరి పట్ల శ్రద్ధ వహించడం, ప్రేమాభిమానాలు పంచడం, ఇతరులను ఆదరించడం వంటి అనేక ఉన్నత అనుభవాల సమ్మిళితంగా జీవితం ఉండాలి. ధ్యానం, యోగా, వ్యాయామం, ఆహారపు అలవాట్లు, భౌతిక దూరం పాటిస్తూనే మానసికంగా దగ్గర కావడం లాంటి సద్గుణాలు కరోనాతో తెర పైకి వచ్చాయి. ఇలాంటి జీవనానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఏర్పడింది.  

మహాత్మాగాంధీ చెప్పినట్లు జీవన పరమార్ధం.. సరైన, ధర్మబద్ధమైన, అర్థవంతమైన జీవితం గడపడమే! స్వామి వివేకానంద చెప్పినట్లుగా మన ఆలోచనలే మనల్ని రూపుదిద్దుతాయి. మన ఆలోచనలను మనమే సక్రమంగా మలచుకోవాలి. వ్యక్తుల తప్పిదాల కారణంగా కరోనాను విపత్తుగా పరిగణించడం సరైంది కాకపోవచ్చు. దీనిని ఓ దిద్దుబాటుగా చూడాల్సి ఉంది అని ఉపరాష్ట్రపతి హితవుపలికారు.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle