newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా మ‌న‌కు అంత డేంజ‌ర్ ఏం కాద‌ట‌

07-03-202007-03-2020 08:03:50 IST
2020-03-07T02:33:50.666Z07-03-2020 2020-03-07T02:33:42.372Z - - 23-04-2021

కరోనా మ‌న‌కు అంత డేంజ‌ర్ ఏం కాద‌ట‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌రోనా పేరు చెబితేనే ప్ర‌పంచం వ‌ణికిపోతోంది. చైనాలోని వుహాన్ న‌గ‌రంలో పుట్టిన ఈ వైర‌స్ ఇప్పుడు 70 దేశాల‌కు వ్యాపించింది. ప్ర‌పంచం న‌లువైపులా వేగంగా విస్త‌రిస్తోంది. 70 దేశాల్లో క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. 90 వేల మందికి పైగా క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డారు. 3000 మందికి పైగా మ‌ర‌ణించారు. చైనాను ఈ వైర‌స్ చిన్నాభిన్నం చేస్తోంది. ఇప్పుడు హైద‌రాబాద్‌లోనూ క‌రోనా కేసు న‌మోదు కావ‌డంతో తెలుగు ప్ర‌జ‌ల్లోనూ ఆందోళ‌న మొదలైంది.

అయితే, భార‌తీయులు క‌రోనా వైర‌స్ గురించి పెద్ద‌గా భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు అంటున్నారు ప్ర‌ముఖ భార‌తీయ శాస్త్ర‌వేత్త గ‌గ‌న్‌దీప్ కాంగ్‌. వైరాల‌జీకి సంబంధించి అనేక ప‌రిశోధ‌న‌లు చేస్తున్న గ‌గ‌న్‌దీప్ ప్ర‌స్తుతం ట్రాన్స్‌లేష‌నల్ హెల్త్ సైన్స్ ఆండ్ టెక్నాల‌జీ ఇన్‌స్టిట్యూట్‌కు డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. లండ‌న్‌లోని ప్ర‌ఖ్యాత శాస్త్ర‌వేత్త‌ల‌తో కూడిన రాయ‌ల్ సొసైటీలో స‌భ్యురాలు కూడా. ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి భార‌తీయురాలు ఆమె.

సుదీర్ఘ‌కాలంగా వైర‌స్‌ల‌పైన ఆమె ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. దీంతో గ‌గ‌న్‌దీప్ వ్యాఖ్య‌లకు ప్రాధాన్య‌త ఏర్పాడింది. క‌రోనా వైర‌స్‌పై ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో పాటు భార‌తీయులకు ప‌లు సూచ‌న‌లు ఇచ్చారు.

క‌రోనా వైర‌స్ ప‌ట్ల భార‌తీయులు పెద్ద‌గా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఇటువంటి వైర‌స్‌ల‌తో మ‌న శ‌రీరం ప్ర‌తీరోజూ పోరాడుతూనే ఉంద‌ని ఆమె పేర్కొన్నారు. కేవ‌లం జ్వ‌రం, జ‌లుబుకు వాడే పారాసెట‌మ‌ల్ వంటి మెడిసిన్‌తోనే క‌రోనా వైర‌స్ కూడా వెళ్లిపోతుందని ఆమె చెబుతున్నారు.

క‌రోనా వైర‌స్ సోకిన ఐదుగురిలో న‌లుగురు స్వంతంగానే కోలుకోగ‌లుగుతార‌ని, మ‌రొక‌రికి మాత్రమే వైద్య చికిత్స అవ‌స‌రం ప‌డుతుంద‌ని ఆమె పేర్కొన్నారు. చిన్న పిల్ల‌ల‌కు ఈ వైర‌స్ వ‌ల్ల పెద్ద ప్ర‌మాదం ఏమీ ఉండ‌ద‌ని, పెద్ద వ‌య‌స్సుల వారిపైనే ఈ వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఆమె అంటున్నారు.

అయినా క‌రోనా వైర‌స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గానే ఉండాల‌ని, చేతులు బాగా క‌డుక్కోవాల‌ని, మ‌నం నివ‌సిస్తున్న ప్ర‌దేశాలు శుభ్రంగా ఉంచుకోవాల‌ని, చేత‌ల‌తో ముఖాన్ని తాక‌వ‌ద్ద‌ని ఆమె సూచ‌న‌లు చేశారు.

ఇదిలా ఉండ‌గా భార‌త్‌లో ఇప్ప‌టి 31 మందికి క‌రోనా వైరస్ సోకిన‌ట్లు గుర్తించారు. హైద‌రాబాద్‌లో ఒక కేసు న‌మోదు కాగా, ప్ర‌స్తుతం బాధితుడు గాంధీ ఆసుప‌త్రిలో కోలుకుంటున్నాడు. కేర‌ళ‌లో మొద‌ట క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇక్క‌డ క‌రోనా వ్యాధి సోకిన ముగ్గురూ ఇప్పుడు కోలుకున్నారు. దేశంలో కరోనా వైర‌స్ సోకిన వారంతా విదేశాల నుంచి వ‌చ్చిన వారే. దేశంలో ఉన్న వారికి ఎవ‌రికీ ఈ వైర‌స్ నేరుగా వ్యాపించ‌లేదు. ఈ వైర‌స్ ప్ర‌మాదం ఎంత ఉంటుంది అనేది ప‌క్క‌న పెడితే జాగ్ర‌త్త‌లు తీసుకొని వైర‌స్‌ను నివారించ‌డం మంచిది.

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   an hour ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   21 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle