newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా బారిన పడ్డ నితిన్ గడ్కరీ

17-09-202017-09-2020 22:37:35 IST
Updated On 17-09-2020 22:37:13 ISTUpdated On 17-09-20202020-09-17T17:07:35.951Z17-09-2020 2020-09-17T17:05:23.207Z - 2020-09-17T17:07:13.777Z - 17-09-2020

కరోనా బారిన పడ్డ నితిన్ గడ్కరీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే..! ఎప్పుడు ఎవరు కరోనా బారిన పడతారోనన్న భయం వెంటాడుతూ ఉంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు.  తన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నానని అన్నారు.

ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. 'ఒంట్లో కొంత నలతగా ఉంటే.. డాక్టర్ ను సంప్రదించాను. చెకప్ లో భాగంగా కోవిద్-19 పాజిటివ్ వచ్చింది. మీ ఆశీర్వచనాలతో ప్రస్తుతానికి నేను బాగున్నాను. ఐసోలేషన్ లో ఉన్నాను' అని ట్వీట్ చేశారు. తనను ఇటీవలి కాలంలో కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు.  వైద్యుల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని అన్నారు.

తాజాగా కరోనా సోకిన యూనియన్ మినిస్టర్స్ లో నితిన్ గడ్కరీ ఒకరు. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షాకు కూడా ఇటీవల కరోనా సోకిన సంగతి తెలిసిందే, రికవరీ అయిన ఆయన ఢిల్లీ ఎయిమ్స్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. లోక్ సభ ఎంపీ బల్లి దుర్గారావు కోవిద్-19 ద్వారా మరణించారు. కరోనా రాజకీయ నాయకులను కూడా కబళించి వేస్తూ ఉండడంతో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు.

సోమవారం నాడు పార్లమెంట్ సెషన్స్ ప్రారంభమైన సమయంలో లోక్ సభ, రాజ్య సభ, సెక్రటేరియట్లలో కోవిద్-19 టెస్టులు తప్పనిసరి చేశారు. పార్లమెంటుకు హాజరయ్యే వారికి, పార్లమెంట్ లో పని చేసే వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. 30 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్ రాగా.. 50 మందికి పైగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.  

దేశంలో గత 24 గంటల్లో 97,894 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 51,18,254కు చేరింది. గ‌త 24 గంట‌ల సమయంలో 1,290 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   44 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   3 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle