newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా బాధితులకు ఆర్థిక సాయం ఇస్తాం.. ఇవ్వం.. కేంద్రం ద్వంద్వ ప్రకటన

15-03-202015-03-2020 08:00:45 IST
2020-03-15T02:30:45.701Z15-03-2020 2020-03-15T02:30:40.377Z - - 17-04-2021

కరోనా బాధితులకు ఆర్థిక సాయం ఇస్తాం.. ఇవ్వం.. కేంద్రం ద్వంద్వ ప్రకటన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రాణాంతక కరోనా వైరస్ బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కొన్ని గంటలలోపే తన ప్రకటన ఉపసంహరించుకోవడం సంచలనం గొలుపుతోంది. కరోనా వైరస్, కోవిడ్-19ను నోటిఫైడ్ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. నోటిఫైడ్ విపత్తుగా ప్రకటించడం వల్ల ఈ వైరస్ బాధితులకు  రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్‌డీఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సాయం అందజేసేందుకు అవకాశం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం ...

కరోనా వైరస్ బాధిత మృతుని కుటుంబ సభ్యులకు ఎస్‌డీఆర్ఎఫ్ నుంచి రూ.4 లక్షలు ఆర్థిక సాయం చేయవచ్చు. సహాయ కార్యక్రమాలు, సంబంధిత ఇతర కార్యక్రమాల్లో పాలు పంచుకుని మరణించినవారికి కూడా ఇది వర్తిస్తుంది. అయితే వ్యక్తి మరణ కారణాన్ని తగిన అధికార పరిథి కలిగిన అధికారి ధ్రువీకరించవలసి ఉంటుంది. 

కోవిడ్-19 పాజిటివ్ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చించి, చికిత్స చేయించడానికి అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల మేరకు చెల్లించవచ్చు.  అనుమానిత కరోనా వైరస్ బాధితులను ప్రత్యేకంగా ఉంచి, వారి నుంచి శాంపిల్స్ సేకరించడం, పరీక్షించడం కోసం రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ అంచనా వేసిన రేట్ల ప్రకారం ఖర్చులు చెల్లించవచ్చు. 30 రోజుల వరకు ఈ శిబిరాల నిర్వహణకు అనుమతి ఉంటుంది. రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ ఈ గడువును పొడిగించవచ్చు.

క్వారంటైన్ క్యాంపులలో ఉండే అనుమానిక కరోనా వైరస్ బాధితులకు తాత్కాలిక వసతి, ఆహారం, తాగునీరు, బట్టలు, వైద్య సంరక్షణ అందజేస్తారు. అదనపు పరీక్షా కేంద్రాల ఏర్పాటు, పోలీసులు, వైద్య సిబ్బంది, పురపాలక సంఘాల అధికారుల కోసం భద్రతా పరికరాల కొనుగోలు కోసం కూడా ఎస్‌డీఆర్ఎఫ్ నిధులను వినియోగించవచ్చునని కేంద్ర ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రులకు థర్మల్ స్కానర్లు, ఇతర అవసరమైన పరికరాలను కొనేందుకు కూడా ఈ నిధులను ఖర్చు చేయవచ్చునని పేర్కొంది. 

మన దేశంలో ప్రస్తుతం 80కి పైగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో ఇద్దరు మరణించారు.

అయితే కోవిడ్ 19 వైరస్ బారినపడి మృతి చెందిన కుటుంబ సభ్యులకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర హోంశాఖ తగిన కారణం చెప్పకుండానే గంటల్లోపే ఆ సహాయాన్ని ఉపసంహరించుకోవడం ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది. సవరించిన దాని ఆదేశం కోవిడ్ వైరస్ రోగులకు ఆసుపత్రి ఖర్చులు ఇవ్వడం గురించి  పేర్కొనలేదు. అదే సమయంలో ఆర్థిక సహాయాన్ని ఉపసంహరిస్తున్నట్లు కూడా హోంశాఖ స్పష్టం చేయకపోవడం గందరగోళాన్ని కలిగిస్తోంది.

భారత్‌లో ప్రస్తుతం 84 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా 5 వేలకు పైగా బాధితులు మరణించగా.. 1,45, 810 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కోవిడ్‌ భయాల నేపథ్యంలో అప్రమత్తమైన పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాయి. ఢిల్లీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు పాఠశాలు, కళాశాలలకు మార్చి 31 వరకు సెలవులు ప్రకటించాయి... షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లను మూసివేశాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నెల ఆఖరు వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   3 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   4 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   21 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   7 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle