newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా నష్టాలకు ఆర్థిక ప్యాకేజీ.. ఆర్థికమంత్రి ఆలోచన అదేనా?

24-03-202024-03-2020 15:00:42 IST
Updated On 24-03-2020 15:03:02 ISTUpdated On 24-03-20202020-03-24T09:30:42.481Z24-03-2020 2020-03-24T09:30:32.473Z - 2020-03-24T09:33:02.063Z - 24-03-2020

కరోనా నష్టాలకు ఆర్థిక ప్యాకేజీ.. ఆర్థికమంత్రి ఆలోచన అదేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కారణంగా దేశం అస్తవ్యస్తం అవుతోంది. జనజీవనం స్తంభించిపోయింది. రోజువారీ కూలీలు ఇళ్ళకే పరిమతం కావడంతో వారి జీవన స్థితిగతులు దుర్భరంగా మారాయి. కరోనా వ్యాప్తి కారణంగా జరిగిన నష్టాలపై దేశానికి సహాయపడటానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తోందని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేయడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.  అంతా భావించినట్టే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మార్చి24న  మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతానని ఆమె తెలపడంతో ఆమె నోటినుంచి ఏ ఉపశమన చర్యలు వుంటాయోనని ఎదురుచూశారు. ఆధార్, పాన్ కార్డు అనుసంధానం గడువును కూడా జూన్ 30 వరకూ పెంచారు. 

అంతా భావించినట్టే ఆర్థికమంత్రి మీడియాతో పలు అంశాలు వెల్లడించారు. 2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పెంచారు. జూన్ 30, 2020 వరకూ ఈ గడువు పెంచారు. పన్ను చెల్లింపుల ఆలస్య రుసుమును 12 నుంచి 9 శాతానికి తగ్గించారు, ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు తుదిదశకు చేరిందన్నారు. జీఎస్టీ రిటర్నుల దాఖలుకు సంబంధించి జూన్ 30 వరకూ గడువు విధించారు. పన్ను వివాదాల చెల్లింపుల్లో 10 శాతం అదనపు రుసుము ఉండదన్నారు. ఆధార్, పాన్ కార్డు అనుసంధానం గడువును కూడా జూన్ 30 వరకూ పెంచారు. 

ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి ఆర్థికమంత్రి త్వరలోనే ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్యాకేజీ ద్వారా  దేశ ప్రజలకు ఆర్థికంగా ఊరట కల్పించనున్నారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా లాభాల్లోఉన్నప్పటికీ, తీవ్ర ఒడిదుడుకుల మద్య సాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ అంచనాలతో భారీగా  పుంజుకున్నాయి. కరోనా వ్యాప్తిపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈరోజు రాత్రి 8గంటలకు జాతినుద్దేశించిన ప్రసంగించనున్నారు. కరోనా ఆందోళన నేపథ్యంలో ప్రజలకు  సూచనలు చేశారు. ఇప్పటికే లాక్‌డౌన్, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలివ్వడం, లాక్‌డౌన్‌లను సీరియస్‌గా తీసుకోవాలంటూ ప్రధాని ట్వీట్ చేశారు. 

వైరస్‌ మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా రిజర్వ్ బ్యాంక్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. మార్చి 19 నుంచే వ్యాపార విపత్తు ప్రణాళిక అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ముంబైలోని ఒక రహస్య ప్రదేశంలో కేవలం 24 గంటల వ్యవధిలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle