newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

28-02-202028-02-2020 09:45:55 IST
2020-02-28T04:15:55.372Z28-02-2020 2020-02-28T04:15:25.269Z - - 11-04-2021

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచదేశాలను కోవిడ్ 19 వైరస్ తెగ భయపెడుతోంది. చైనా కేంద్రంగా కరోనా వైరస్‌ పలు ప్రపంచ దేశాలకు వ్యాపించడంతో భారత ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. జపాన్‌, దక్షిణ కొరియా నుంచి వచ్చే ట్రావెలర్స్‌కు వీసా ఆన్‌ అరైవల్‌ సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇమిగ్రేషన్‌ బ్యూరో, హోం వ్యవహరాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు వెల్లడించాయి. మరోవైపు చైనాలో 44 తాజా మరణాలతో కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 2,788కి చేరింది. 

చైనా వ్యాప్తంగా గురువారం 433 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్‌ సోకిన వారి సంఖ్య 80 వేలకు పెరిగింది. ఈ వైరస్‌ తొలుత వెలుగులోకి వచ్చిన హుబేయ్‌ ప్రావిన్స్‌లోనే నూతన కేసులు, మృతుల సంఖ్య అధికంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. అక్కడ రోడ్లపై జనసంచారం బాగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. చైనా వ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయి.

దీని ప్రభావం ప్రపంచ మార్కెట్ పై పడింది. ఇదిలా వుంటే.. కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి భారతీయుల తరలించారు. వుహాన్ నుంచి 76 మందిని, జపాన్ నుంచి 119 మంది భారతీయుల తరలింపు. చైనా, జపాన్ నుంచి ఢిల్లీ చేరుకున్నాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎయిర్ ఇండియా విమానాలు.  వీరికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. 

తగ్గిపోయిన చికెన్ అమ్మకాలు 

గత నెలరోజులుగా చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. కోవిడ్ 19 ఎఫెక్ట్ తో 50 శాతం అమ్మకాలు తగ్గిపోయాయని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. గుడ్డు తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది వుండదని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ప్రకటనలు ఇస్తున్నా జనం మాత్రం భయంతో ముక్కకు దూరంగా వుంటున్నారు. వారానికి 6 లక్షల కోళ్లు విక్రయించేవారు. నెల రోజుల్లో 40 శాతం అమ్మకాలు తగ్గాయి.

దేశవ్యాప్తంగా వారానికి 7.5 కోట్ల కోళ్లు అమ్ముడవుతున్నాయని, ఇది 3.5 కోట్ల కోళ్లకు పడిపోయిందంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌ మార్కెట్లో కొద్ది రోజుల క్రితం స్కిన్‌లెస్‌ చికెన్‌ మాంసం రూ.250 దాకా దూసుకెళ్లింది. గత వారం రూ.110కి దిగొచ్చి ప్రస్తుతం రూ.130 పలుకుతోంది. ఈ వైరస్ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పౌల్ట్రీ పరిశ్రమ రూ.700 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. వైరస్ కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్‌-19 వైరస్‌ భారత ఆర్థిక పునరుద్ధరణకు అడ్డంకిగా మారవచ్చని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ హెచ్చరించింది. చైనా దిగుమతులపై ఆధారపడి ఉన్న కంపెనీలకు సరఫరా అవాంతరాలు ఎదుర్కోవాల్సి రావచ్చని, ఈ పరిణామంతో వస్తు ధరలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన కలిగిస్తోంది. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   17 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   16 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   20 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle