newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా తీవ్రత పట్టని కేంద్రం- అదే వచ్చింది...అలాగే పోతుందన్న వైఖరి!

22-09-202022-09-2020 21:06:47 IST
2020-09-22T15:36:47.256Z22-09-2020 2020-09-22T15:36:43.662Z - - 14-04-2021

కరోనా తీవ్రత పట్టని కేంద్రం- అదే వచ్చింది...అలాగే పోతుందన్న వైఖరి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్రపంచ మహమ్మారి కరోనాను సీరియస్  గా తీసుకోని దేశం ఏదైనా ఉందంటే అది భారత్ మాత్రమే. కరోనా వ్యాప్తి తీవ్రత. అది సృష్టిస్తున్న విలయంపై కంటే, కేంద్రం తన అజెండాను ముందుకు తీసుకువెళ్లడంపైనే దృష్టి కేంద్రీకరించింది. కరోనా తీవ్రత ప్రపంచ దేశాలన్నిటి కంటే భారత్ లో అధికంగా ఉన్న సమయంలో కరోనా కట్టడి చర్యలపై దృష్టి సారించడం మాని కేంద్రం...విద్యుత్, వ్యవసాయ బిల్లుల ఆమోదంపైనే దృష్టి సారించింది. రాష్ట్రాలు, విపక్షాలు వ్యతిరేకిస్తున్నా ఖాతరు చేయకుండా...దేశంలో రోజుకు రమారమి 95 వేల మంది కరోనా బారిన పడుతున్నా పట్టించుకోకుండా రాజకీయ అజెండాను ముందుకు తీసుకుపోవడంపైనే కేంద్రంలోని మోడీ సర్కార్ దృష్టి సారించింది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతి రోజూ కరోనా గణాంకాలపై విడుదల చేసే బులిటెన్ లో కరోనా వ్యాప్తి తీవ్రత కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా, రికవరీ రేటు, మరణాల సంఖ్య తక్కువ అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రయత్నిస్తున్నది. తప్ప కట్టడి చర్యలను మరింత కట్టుదిట్టంగా తీసుకునే దిశగా ఆలోచన చేయడం లేదు. అన్ లాక్ డౌన్ పేరుతో ఒకదాని తరువాత ఒకటిగా అన్నీ తెరుచుకుంటున్నాయి. ఎప్పుడో ఏడు నెలల కిందట దేశంలో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదౌతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతి నుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ మహమ్మారిపై మానవాళి పోరును ప్రపంచ యుద్ధాల కంటే తీవ్రమైదనిగా అభివర్ణించారు.

దేశ ప్రజలను కాపాడుకోవడం కంటే ముఖ్యమైన ప్రధానమైన అంశమేదీ లేదని ఉద్ఘాటించారు. జనతా  కర్ఫ్యూ పాటిద్దామనీ, కోవిడ్ వారియర్స్ కు సంఘీభావ  సూచకంగా తప్పట్లు  చరుద్దామని పిలుపు నిచ్చారు. ఈ తరువాతి నుంచి దేశంలో కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించారు. అంతే ఆ తరువాత అంతా షరామాములేగా  మారిపోయింది. జనం కష్టాల గురించి ఆలోచించడం కంటే...ఆర్థిక వృద్ధి, జీడీపీ పతనం వంటి విషయాలే ప్రభుత్వానికి ప్రధానాంశాలయ్యాయి. జనం జాగ్రత్తలు తీసుకని మద్యం కొనుగోలుల చేసుకోవచ్చు అంటూ ఆన్ లాక్ డౌన్ 1తో మొదలు పెట్టి ఇప్పుడు కరోనాతో సహజీవనం వినా మరో మార్గం లేదన్న భావనకు జనం వచ్చేలా చేశారు.

అసలే ఉపాధి అవకాశాలు మృగ్యమైపోయిన ప్రజలు ఇప్పుడు బతుకు భయంతో రోడ్లపైకి వచ్చి పనులు వెతుక్కుంటున్నారు. కరోనా నుంచి రక్షణ చర్యలేవీ ప్రభుత్వ పరంగా వారికి అందుబాటులో లేవు. ఇప్పుడు మళ్లీ మరో మారు కేసీఆర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడడానికి సమాయత్తమౌతున్నారు. కరోనా వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలు, ఆరోగ్య శాఖ మంత్రులతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి సమీక్షించనున్నారు.  కరోనా కట్టడికి నిర్దుష్ట కార్యాచరణ, వ్యూహం లేకుండా సమీక్షలతో ఉపయోగం పెద్దగా ఉంటుందన్న నమ్మకం లేదు.  


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle