కరోనా చీకట్లు తరిమేయండి.. దీపాలు వెలిగించండి
03-04-202003-04-2020 09:18:24 IST
Updated On 03-04-2020 11:46:59 ISTUpdated On 03-04-20202020-04-03T03:48:24.522Z03-04-2020 2020-04-03T03:48:19.993Z - 2020-04-03T06:16:59.211Z - 03-04-2020

కరోనా వైరస్ పై దేశం చేస్తున్న పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు ప్రధాని మోడీ. మార్చి 22 వ తేదీన జనతా కర్ఫ్యూ దేశమంతా ఒకటేనని చాటిచెప్పామని, మనం చేసినపని ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఏప్రిల్ 5న ఆదివారం కరోనా చీకట్లను తరిమేయాలి.. రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆపేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆరోజున లైట్లు ఆపేసి.. కొవ్వొత్తి, దీపం లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేయండి.. కరోనా చీకట్లను తరిమేయాలి, ఎవరు, ఎక్కడ ఉన్నా లైట్లు ఆపేయండి అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. 130 కోట్లమంది ఒకేస్ఫూర్తితో ముందుకు సాగండి అంటూ యావత్ జాతికి మోడీ వీడియో సందేశం అందించారు. గత నెలలో జనతా కర్ఫ్యూ తరహాలోనే మోడీ ముందుకు సాగారు. కరోనా లాక్ డౌన్ అమలవుతున్న వేళ మోడీ ఏం మాట్లాడతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే మోడీ లాక్ డౌన్ గురించి అంత సీరియస్ గా స్పందించలేదు. ఇంకా సమయం ఉందని భావించి వుంటారు. దేశవ్యాప్తంగా మోడీ సందేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మార్చి 22న కూడా జనతా కర్ఫ్యూ విషయంలోనూ మోడీ ఆలోచన వినూత్నంగా సాగింది. జనమంతా ఒక్కటయ్యారు. ఉదయం అంతా స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించారు. సాయంత్రం ఐదుగంటలకు బయటకు వచ్చిన చప్పట్లతో మారుమోగింది దేశం. లాక్ డౌన్ అమలవుతున్న వేళ సామాజిక దూరం పాటించండి. మీ కాలనీలో ఒకేచోట గుమిగూడకుండా దీపాలు వెలిగించండి. ఆ దీపాల కాంతిలో కరోనా మహమ్మారిని పారద్రోలాలి. భారతీయులంతా ఏకమయితే కరోనా తరిమికొట్టడం అసాధ్యం కాదన్నారు మోడీ. మేం ఒక్కరమే కదా ఇంట్లో వుండి ఏం సాధిస్తామని ప్రజలు అనుకుంటున్నారు. జనమంతా ఇంట్లోనే ఉంటే కరోనాను జయించినట్లేనని భావించండి. జనతా కర్ఫ్యూ ద్వారా మన శక్తి సామర్ధ్యాలు అందరికీ చాటాం. లాక్ డౌన్ ప్రపంచం పాటిస్తోంది. ప్రపంచం మనవైపే చూస్తోంది. ఈ ఆదివారం కూడా మరోసారి మన సత్తా, మన ఐక్యత చాటుదాం. కరోనాను తిప్పికొట్టే సంకల్పం తీసుకోవాలి. ఆదివారం రాత్రి 9 గంటలకు అంతా ఏకం కావాలి. కొవ్వొత్తులు, దివ్వెలు, ప్రమిదలు వెలిగించండి. ఈ సమయం నాకివ్వండి. ఈ విపత్కర పరిస్థితుల్లో భారతీయుల శక్తిని, ఉత్సాహాన్ని ఈ సంకల్పం మరింత పెంచుతుంది. మన సంకల్పానికి మించిన శక్తి ఎక్కడా ఉండదు. కరోనాపై పోరాటం చేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు అన్నారు మోడీ.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
4 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
4 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
4 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
8 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
9 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
8 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
10 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
10 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
6 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
12 hours ago
ఇంకా