newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా గురించి బెంగాల్ బీజేపీ నేత ఏమన్నారో విన్నారా..?

12-09-202012-09-2020 07:08:23 IST
2020-09-12T01:38:23.656Z12-09-2020 2020-09-12T01:38:20.785Z - - 22-04-2021

కరోనా గురించి బెంగాల్ బీజేపీ నేత ఏమన్నారో విన్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి.. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. భారతదేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు ఉన్న దేశంగా త్వరలోనే భారత్ నిలవనుంది. ఇప్పటికీ ఎంతో మంది ఆసుపత్రి బెడ్ ల మీద చికిత్స పొందుతూ ఉన్నారు. కానీ ఓ బీజేపీ నేత మాత్రం కరోనానే లేదని చెబుతూ ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తాజాగా మాట్లాడుతూ దేశంలో కరోనా వైరస్ ఎప్పుడో వెళ్లిపోయిందట.. మరి దేశంలో లాక్ డౌన్ ఇవన్నీ ఎందుకు పెట్టారో ఆయన చెబుతున్న కారణం ఏమిటో తెలుసా..? బీజేపీ నేతలు బహిరంగ సభలు పెట్టనివ్వకుండా అట..! మీరు కూడా షాక్ అయ్యారు కదూ.. ఆయన చెప్పిన మాటలు విని అక్కడ ఉన్న వారందరూ కూడా షాక్ అయ్యారు కరోనా వైరస్ ఎప్పుడో పోయిందని, కానీ సభలు పెట్టనివ్వకుండా బీజేపీని అడ్డుకునేందుకు సీఎం మమతా బెనర్జీ కావాలనే వైరస్ ఉందంటోందట. ఆమె లాక్ డౌన్లు విధిస్తూ ఉండడానికి అసలు కారణం ఇదేనని ఆయన ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రజలకు దగ్గర కానివ్వకుండా చేయడమే మమతా బెనర్జీ చేస్తున్న ప్లాన్ అని.. బీజేపీ నేతల సభలు, సమావేశాలు జరపనివ్వకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 2021లో ఎన్నికలు జరగబోతున్నాయి. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో కూలదోయాలని బీజేపీ యోచిస్తోంది. ప్రజల మద్దతు తమకే ఉందని.. తమను ఎవరూ ఆపలేరని దిలీప్ ఘోష్  చెబుతూ ఉన్నారు.

దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నాయకులే తలలు పట్టుకుంటూ ఉన్నారు. ఆయన వ్యాఖ్యలకు ఎలా స్పందించాలో సొంత నేతలకే తెలియడంలేదు. ఇక సామాజిక మాధ్యమాల్లో ఆయన గురించి విపరీతమైన ట్రోల్స్ వస్తూ ఉన్నాయి.

ప్రస్తుతం అమెరికాలో 65,88,825 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. భారత్‌లో 45,62,451 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అక్టోబర్‌ నెల పూర్తి అయ్యే సరికి భారత్‌లో కేసుల సంఖ్య 70లక్షలు దాటే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతూ ఉన్నారు. కొద్దిరోజుల కిందటే భారత్ బ్రెజిల్ ను దాటి అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన రెండో దేశంగా నిలిచింది.  

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   8 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   11 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   15 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   15 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   13 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle