కరోనా కేసుల డేంజర్ బెల్స్... 15,968 పాజిటివ్ కేసులు.. 465 మరణాలు
24-06-202024-06-2020 12:30:55 IST
Updated On 24-06-2020 16:13:18 ISTUpdated On 24-06-20202020-06-24T07:00:55.422Z24-06-2020 2020-06-24T07:00:36.474Z - 2020-06-24T10:43:18.533Z - 24-06-2020

దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తూనే వుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనను పెంచుతోంది. తాజాగా దేశంలో రికార్డు స్థాయికి చేరాయి కరోనా పాజిటివ్ కేసులు గడచిన 24 గంటల్లో 15,968 కరోనా కేసులు.. 465 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా కేసుల వెల్లువకు తెరపడట్లేదు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,56,183కి చేరింది. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 1,83,022 మంది చికిత్స పొందుతుండగా.. 2,58,685 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకు 14,476 మంది ప్రాణాలు విడిచారు. కరోనా వైరస్ కారణంగా పశ్చిమబెంగాల్ లో ఓ ఎమ్మెల్యే మరణించారు. అంతకుముందే తమిళనాడులోనూ ఎమ్మెల్యే బలయ్యారు. ఒక్కరోజే 2,15,195 శాంపిల్స్ పరీక్షించామని ఐసీఎంఆర్ తెలిపింది. జూన్ 23 వరకూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 73 లక్షల 52 వేల 911 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. పశ్చిమబెంగాల్లో తమోనష్ ఘోష్ కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మూడుపార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. టీఎంసీ ఎమ్మెల్యే మృతికి సీఎం మమతా బెనర్జీ, పార్టీనేతలు సంతాపం తెలిపారు. ఆయన వయసు 60 ఏళ్ళు. ఇండియాలో ఇప్పుడు రికవరీ రేటు 56.7గా ఉందని అధికారులు తెలిపారు. అంటే దానర్థం కరోనా బారిన పడ్డవారిలో సగం మంది రిస్క్ నుంచి బయటపడినట్లే. ఇది మెల్లగా పెరుగుతోంది. ఎంత పెరిగితే అంత మనకే మంచిది. అలాగే దేశంలో కరోనా మరణాల రేటు 3.2గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇది 9 శాతంగా ఉంది. అంటే మన దేశంలో కొంత కంట్రోల్ ఉన్నట్లే. అలాగే... ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసులు ఉన్న దేశాల్లో మన ఇండియా నాలుగో స్థానంలో ఉంది. దేశంలో కరోనా కేసులు, రికవరీ, మరణాలు తీరు ఇలా వుంది అండమాన్ నికోబార్ దీవులు 50కేసులు రికవరీ 40 మరణాలు 0 ఆంధ్రప్రదేశ్ 10,002కేసులు రికవరీ 4599 మరణాలు 119 అరుణాచల్ ప్రదేశ్ 148 కేసులు రికవరీ 22 మరణాలు 0 అసోం 5831కేసులు రికవరీ 3762 మరణాలు 9 బీహార్ 8153 కేసులు రికవరీ 6104 మరణాలు 56 చండీఘర్ 418 కేసులు రికవరీ 322 మరణాలు 6 ఛత్తీస్ ఘడ్ 2362 కేసులు రికవరీ 1553 మరణాలు 12 దాద్రానగర్ హవేలీ 120 కేసులు రికవరీ 29 మరణాలు 0 ఢిల్లీ 66,602 కేసులు రికవరీ 39,313 మరణాలు 2301 గోవా 909 కేసులు రికవరీ 205 మరణాలు 1 గుజరాత్ 28,371 కేసులు రికవరీ 20,513 మరణాలు 1710 హర్యానా 11,520 కేసులు రికవరీ 6498 మరణాలు 178 హిమాచల్ ప్రదేశ్ 775 కేసుల రికవరీ 443 మరణాలు 8 జమ్ముకాశ్మీర్ 6236 కేసులు రికవరీ 3642 మరణాలు 87 జార్ఱండ్ 2185 కేసులు రికవరీ 1520 మరణాలు 11 కర్నాటక 9721 కేసులు రికవరీ 6004 మరణాలు 150 కేరళ 3451 కేసులు రికవరీ 1809 మరణాలు 22 లడక్ 932 కేసులు రికవరీ 148 మరణాలు1 మధ్యప్రదేశ్ 12,261 కేసులు రికవరీ 9335 మరణాలు 525 మహారాష్ట్ర 1,39,010 కేసులు రికవరీ 69631 మరణాలు 6531 మణిపూర్ 921 కేసులు రికవరీ 258 మరణాలు 0 మేఘాలయ 46 కేసులు రికవరీ 37 మరణాలు 1 మిజోరాం 142 కేసులు రికవరీ 9 మరణాలు 0 నాగాలాండ్ 330 కేసులు రికవరీ 141 మరణాలు 0 ఒడిశా 5470 కేసులు రికవరీ 3988 మరణాలు 17 పాండిచ్చేరి 402 కేసులు రికవరీ 165 మరణాలు 9 పంజాబ్ 4397 కేసులు రికవరీ 3047 మరణాలు 105 రాజస్థాన్ 15,627 కేసులు రికవరీ 12213 మరణాలు 365 సిక్కిం 79 కేసులు రికవరీ 29 మరణాలు 0 తమిళనాడు 64,603 కేసులు రికవరీ 35339 మరణాలు 833 తెలంగాణ 9553 కేసులు రికవరీ 4224 మరణాలు 220 త్రిపుర 1259 కేసులు రికవరీ 807 మరణాలు 1 ఉత్తరాఖండ్ 2535 కేసులు రికవరీ 1602 మరణాలు 30 ఉత్తరప్రదేశ్ 18,893కేసులు రికవరీ 12116 మరణాలు 588 పశ్చిమబెంగాల్ 14,728కేసులు రికవరీ 9218 మరణాలు 580

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
an hour ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
an hour ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
4 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
2 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
5 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
19 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
a day ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
20 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
16-04-2021

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
a day ago
ఇంకా