newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా కేసుల ఉధృతి.... తొలి టీకా రెడీతో అందరిలో కొత్త ఆశలు

13-07-202013-07-2020 11:06:49 IST
Updated On 13-07-2020 11:11:05 ISTUpdated On 13-07-20202020-07-13T05:36:49.728Z13-07-2020 2020-07-13T05:36:33.930Z - 2020-07-13T05:41:05.251Z - 13-07-2020

కరోనా కేసుల ఉధృతి.... తొలి టీకా రెడీతో అందరిలో కొత్త ఆశలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా కేసుల తీవ్రత బాగా పెరిగింది. గత వారం రోజులుగా కేసుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఏరోజుకారోజు కేసులు పెరుగుతూనే వున్నాయి. గడచిన 24 గంటల్లో 28,701 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 23,174గా నమోదయ్యాయి. మహారాష్ట్రలో కోవిడ్ ఉధృతి ఎక్కువగావుంది. ఒక్కరోజే 8 వేల కేసులు నమోదయ్యాయి.

పుణెలోని ఎయిమ్స్ వైద్యులు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. 18మంది వాలంటీర్లను ఎంపిక చేశారు. ఈ ఏడాది చివరినాటికి భారతీయ వ్యాక్సిన్ కూడా ఒక దశకు రానుంది. కోవిడ్ కేసుల్లో భారత్ మూడవ స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో వున్నాయి. కోవిడ్ కేసుల సంఖ్య మొత్తం కోటి 30లక్షల, 36 వేలు దాటాయి. మరణాల సంఖ్య 5 లక్షల 71 వేలు దాటాయి. 

https://www.photojoiner.net/image/RPTk2KZO

ప్రపంచంలోనే తొలిసారిగా రష్యాలో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ అన్ని దశల క్లినికల్‌ ట్రయల్స్‌ని పూర్తి చేసుకోవడం కరోనాని తరిమికొట్టగలమన్న ఆశల్ని పెంచుతోంది. రష్యాలోని సెచెనోవ్‌ మెడికల్‌ యూనివర్సిటీ చేసిన కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగం కీలక దశలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసినట్టుగా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌లేషన్‌ మెడిసిన్‌ అండ్‌ బయోటెక్నాలజీ డైరెక్టర్‌ వాదిమ్‌ తారాసోవ్‌ వెల్లడించారు.

గమలి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీ అండ్‌ మైక్రోబయోలజీ కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ను జూన్‌ 18 నుంచి ప్రారంభించింది.వ్యాక్సిన్‌ను పరీక్షించిన వాలంటీర్లలో మొదటి బృందాన్ని బుధవారం డిశ్చార్జ్‌ చేస్తారు. రెండో బృందం వాలంటీర్లను జూలై 20న డిశ్చార్జ్‌ చేయనున్నట్టుగా తారాసోవ్‌ తెలిపారు. టీకా భద్రత పరీక్షలు కూడా దిగ్విజయంగా పూర్తయ్యాయి. 

వ్యాక్సిన్‌ భద్రత పరీక్షలు కూడా పూర్తి కావడంతో ఇక వ్యాక్సిన్‌ అభివృద్ధిపై సెచెనోవ్‌ యూనివర్సిటీ దృష్టి సారించనుంది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తోంది. కాగా గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) లండన్‌కి చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ అత్యంత పురోగతిలో ఉందని వెల్లడించింది. ఆ వ్యాక్సిన్‌ ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉంది. ఇప్పుడు రష్యా యూనివర్సిటీ అన్ని దశల క్లినికల్‌ ట్రయల్స్‌ని పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. 

మరోవైపు 2021 కంటే ముందు కరోనా మహమ్మారిపై 100 శాతం సమర్థవంతంగా పనిచేసే వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు తక్కువే అంటున్నారు ఫ్రాన్స్ కి చెందిన శాస్త్రవేత్తలు. కరోనాపై పోరాడే శక్తి కలిగిన వ్యాక్సిన్ల పై పరిశోధనలు సాగుతున్నాయి. పాక్షికంగా పనిచేసే టీకాలు రావచ్చు. కానీ పూర్తిస్థాయిలో నియంత్రించే శక్తి కావాలంటే ఇంకా పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ ఇంకా పెరగాలంటున్నారు. క్లోజ్డ్ ఏరియాలు, జనసమ్మర్థం ఎక్కువగా ఉండేచోట కఠినమయిన ఆంక్షలుండాలని అంటున్నారు. 

 

 

 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   13 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   20 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle